వరవిక్రయం (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

తెలుగు నాటకం
కొత్త పేజీ: సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్లకూరి నారాయణ రావుగారు వర...
(తేడా లేదు)

01:27, 1 జూలై 2011 నాటి కూర్పు

సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్లకూరి నారాయణ రావుగారు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం. ఈ నాటకం ఆధారంగా వరవిక్రయము చలన చిత్రం సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మితమైంది. ఆ చిత్రం ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి తెలుగు తెర కు పరిచయమయ్యారు. కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరణం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు.

కథ

పుణ్యమూర్తుల పరుషోత్తమరావు రెవెన్యు ఇన్స్ పెక్టర్ గా పని చేస్తూ సహాయనిరాకరణోద్యమంలో ప్రభుత్వోద్యాగాన్ని వదిలి వేసారు. ఆయనకిద్దరు కుమార్తెలు కాళింది, కమల. వారి వరాన్వేషణతో నాటకం ప్రారంభమవుతుంది. వరకట్నానికి వ్యతిరేకి అయిన పురుషోత్తమరావు కాలానికి తలఒగ్గి