బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''బుద్ధిమంతుడు''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో ఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కధలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కధాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తి వలే ఒకరికి కనుపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా , చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కధలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కధ స్వరూపమే మారిపోయింది.
 
[[అక్కినేని]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అ క్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా (భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం [[ముత్యాలముగ్గు]] లో ఇదే పంధా నడుస్తుంది. (దాసరి [[దేవుడే దిగివస్తెదిగివస్తే]], [[రాజాచంద్ర]], [[మావూళ్ళో మహాశివుడు]] దీనికి కొనసాగింపు)
==సంక్షిప్త కధ==