కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''కేన''' అనగా [[ఎవరు]] ? అని అర్ధము
ఇందు భగవానుని వర్ణన చేయబడినది , [[భగవానుడు]] ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది .
 
"కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.
 
1. కేనేషితం పతతి ప్రేషితం మనః
 
కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః |
 
కేనేషితాం వాచమిమాం వదన్తి
 
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయుదక్తి ||
 
 
మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది?
 
2. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్
 
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః |
 
చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః
 
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి ||
 
ఆత్మ శక్తి వలననే చెవి వింటుంది. కన్ను చూస్థుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పని చేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.
 
3. నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్ గచ్చతి నోమనః |
న విద్యో న విజానీయో యథైవ దనుశిష్యాత్ ||
 
ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతికూడా మాకు తెలియదు.
 
4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |
 
ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే ||
 
నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. తరువాత అది తెలియనిదానికంటే అతీతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం.
 
5. యత్ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే|
 
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే ||
 
మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.
 
6. యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే||
 
మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
7. యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి|
 
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే ||
 
కన్నులు చూడజాలనిదికాని దృష్టిని చూసేది - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
8. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్|
 
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే ||
 
మానవుడు చెవిద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుచున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
9. యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే|
 
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే ||
 
మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
ఇది ప్రథమ భాగము.
 
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు