కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84:
నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా. నా తోటి విద్యార్థులలో అది తెలియనిది కాదు అనీ, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు.
 
::యస్యమతంయస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః|
::అవిజ్ఞాతాం విజానతాం విజ్ఞాత మవిజానతామ్|| 3
 
ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలియదని భావించునో వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో వాడు దాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మవేత్తలు రెండు తెగలు. బ్రహ్మము తెలిసినది అనుకొన్నవారు. వీరికి బ్రహ్మము తెలియనిది. కాని రెండవ తెగవారు బ్రహ్మము తెలియదు అనుకొనువారు. వీరికి బ్రహ్మము తెలియును.
 
::ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విదన్తే|
::ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతే మృతమ్|| 4
 
మనస్సు చెందే ప్రతీ వికారంద్వారా దాన్ని స్ఫూర్తిగోచరం చేసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు. జ్ఞానంద్వారా అమరత్వాన్ని పొందుతాడు.
 
::ఇహ చేద వేదీ దథ సత్యమస్తి
::న చేదిహావేదీ న్మహతీ వినష్టిః |
::భూతేషు భూతేషు విచిత్య ధీరాః
::ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి || 5
 
ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్న్ట్లట్లయితే ఆపైన నిజమైన జీవితం ఉన్నది. ఇక్కడ సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షించుకుంటూ ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.
==తృతీయ భాగము==
 
::బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే తస్యహ
::బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త |
::త ఐక్షన్తాస్మాకమేవాయం విజయో
::స్మాకమేవాయం మహిమేతి || 1
 
ఆచార్యుడు: బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు (రాక్షసులపైన) విజయం సాధించిపెట్టిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా దానివలన దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం, మాదే ఘనత అని దేవతలు తలపోసారు.
 
::తద్దైషాం విజజ్ఞౌ తేభ్యోహ ప్రాదుర్భభూవ |
::తన్న వ్యజానత కిమిదం యక్షమితి || 2
 
దేవతల ఈ గర్వాన్ని బ్రహ్మం తెలుసుకున్నది. వారి ఎదుట దివ్యతేజమై సాక్షాత్కరించింది.కాని ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు.
 
::తేఌగ్ని మబ్రువన్, జాతవేద; ఏతథ్ |
::విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి || 3
 
దేవతలు అగ్నిదేవునితో "ఓ జాతవేదుడా (సర్వజ్ఞుడు) ఆ అపురూపమయిన శక్తి ఏమిటో తెలుసుకో" అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు.
 
::తదభ్యద్రవత్, తమభ్యవదత్ కోఌ సీతి, అగ్నిర్వా |
::అహమస్మీతస్య బ్రవీజ్ఞాతవేదా వా అహమస్మీతి || 4
 
అగ్ని ఆ దివ్యశక్తి వద్దకు వేగంగా వెళ్ళాడు. నీవెవరివని ఆ శక్తి అతణ్ణి ప్రశ్నించింది. "నేను అగ్నిని. సర్వజ్ఞుణ్ణి" అని అగ్ని బదులిచ్చాడు.
 
::తస్మిం స్వ్యయి కింవీర్య మిత్యపీదం సర్వం |
::దహేయం యదిదం పృథి వ్యామితి|| 5
 
 
 
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు