బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Dupuis, Pierre - Basket of Plums.jpg|thumb|240px|పండ్ల బుట్ట చిత్రపటం.]]
[[File:Baskets four styles.jpg|thumb|right|బుట్టలలో రకాలు]]
'''బుట్ట''' (బహువచనం : '''బుట్టలు'''; [[ఆంగ్లం]]: '''Basket''') లను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి, లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంభంధిత భాగాలతో చెయ్యడMచెయ్యడం వలన, అవి కాలక్రమేన సహజంగానే శిధిలమయ్యె, జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము. అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై (pottery) బుట్టల అల్లిక గుర్తులు (imprints of weavings) లభించడం వలన ఆ కాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలు రకాలైన పనులకై వినియోగిస్తారు. గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం కలదు. బుట్టలను [[వెదురు]]తో, చెట్లాకులతో, కొన్ని రకాల చెట్లదుంగలతో (Log), వేర్లతో ((Roots), చెట్లబెరడు (Bark), మరియు కొన్నిరకాల గడ్ది (Grass)తో అల్లెదరు.
అయా ప్రాంతాలలొ లభించే చేట్లనుండి, ఆకుల నుండి, దుంగలనుండి బుట్టలను అల్లడం జరుగుచున్నది. చెట్ల ఆకుల నుండి తయారు చెయ్యు బుట్టలకు ఇదాహరణ: తాటాకు బుట్టకు, ఈతాకుబుట్టలు, కొబ్బరి ఆకుల బుట్టలు. అయితే ఇవి అంత నాణ్యమైనవి కావు.ఎక్కువ బరువు కలిగిన వస్తువులను వుంచుటకు అనుకూలమైనవి కావు. వీటి వినియోగ జీవితకాలము తక్కువగా వున్నది. రెల్లు(reed), తుంగ, స్వీట్ గ్రాస్‌ గడ్దిలతో కూడా బుట్టలు అల్లెదరు. అలాగే వెదురు (bamboo), పైన్‌ (pine), పేమ్‌ (cane), స్వాంప్‌ యాష్‌ (swamp ash), మరియు బ్లాక్‌ యాష్‌ (Black ash) చెట్ల కాండం (stem), మరియు దుంగల (log)లతో బుట్టలను అల్లెదరు. అర్కటిక్‌ పరిసరప్రాంతాలలోని తెగల వారు గడ్దితో బుట్టలను అల్లెదరు. ఇంగ్లాండు ప్రాంతము వారు స్వాంప్‌ యాష్‌ దుంగలతో, గ్రేట్‌లెన్స్ ప్రాంతాలవారు బ్లాక్‌యాష్‌ దుంగలతో బుట్తలను అల్లెదరు. కెనడియన్లు స్వీట్‌గ్రాస్‌తో బుట్టలను తయారు వెయ్యుదురు. భారతదేశము మరియు తూర్పు ఆసియా (చైనా, జపాన్‌) దేశాలలో వెదురుతో బుట్టలు తయారు చెయ్యుదురు. ఈ ప్రామ్తములోప్రాంతములో వెదురు విస్తారం గా లభించుటమే యిందుకు కారణము. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో లక్షాలాది మందికి వెదురు బుట్టల అల్లికయే జీవనోపాధి. భారతదేశములో వెదురుతో పాటు కొబ్బరాకు, ఈతాకు, తాటాకులతో కూడా బుట్తలను అల్లడం వాడుకలో కలదు. భారతదేశములో [[మేదరి]] కులస్తులు, గిరిజనులు బుట్టలు అల్లడం లో మంచి నిపుణత కలిగిన వారు.
 
====వెదురు బుట్టలు====
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు