కార్తవీర్యార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: jv:Arjuna Sasrabahu
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Avatarsparshuram.jpg|frame|కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను ఖండిస్తున్న [[పరశురాముడు]].]]
 
'''కార్తవీర్యార్జునుడు''' ([[సంస్కృతం]]: कार्तवीर्य अर्जुन, [[IAST]]: Kārtavīrya Arjuna) [[హైహయ వంశము|హైహయ]] వంశజుడైన [[కృతవీర్యుడు|కృతవీర్యుని]] పుత్రుడు. ఇతడు శాపవశమున [[చేతులు]] లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. [[దత్తాత్రేయ మహర్షి]] కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల [[మహిష్మతీపురము]]. ఇతని పురోహితుడు [[గర్గుడు]].
 
ఒకసారి [[అగ్ని]] తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
పంక్తి 9:
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
 
ఆ తరువాత [[పరశురాముడు]] యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి [[శమంతపంచకం]]. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
 
కార్తవీర్యార్జునుడు [[రావణుడు|రావణుని]]తో యుద్ధం చేసి బంధించెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:హైహయ వంశము]]
 
[[en:Kartavirya Arjuna]]
[[id:Kartawirya Arjuna]]