పెళ్లీడు పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==కధాగమనం==
పి.వి.రావు ([[సోమయాజులు]]) చెల్లెలు చనిపోతూ తన ఇద్దరు కూతుళ్ళూ అయిన దుర్గ([[సంగీత]]), శాంతి([[విజయశాంతి]])లను వాళ్ళ ఆస్తిని అతనికప్పగించి పోతుంది. పి.వి.రావు వారి [[ఆస్తి]]ని స్వాదీనం చేసుకొని దుర్గకు ఒక పేదవాడైన చలపతి ([[శరత్ బాబు]]) తో పెళ్ళి చేస్తాడు. దుర్గ అతని దుర్మార్గం తెలుసుకొని చెల్లెను తెసుకొని వచ్చేసి [[పచ్చడి|పచ్చళ్ళు]], [[అప్పడం|అప్పడాలు]] తయారు చేస్తూ జీవిస్తుంటుంది. తన కాలేజీలోనే చేరిన పి.వి.రావు కొడుకు తనకు [[బావ]] అయిన సురేష్‌ను గుర్తించి అతడిని ఆట పట్టిస్తూంటుంది శాంతి, తన స్నేహితురాలైన [[అన్నపూర్ణ]] ([[సుమలత]])తో కలసి. అతడు కూడా ఆమె ఎవరో తెలుసుకొన్న తరువాత ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలెడతారు. వీళ్ళిద్దరి [[ప్రేమ]] విషయం తెలిసిన పి.వి.రావు తన కొడుక్కు ఆస్తి కోసం [[వల]] వేస్తున్నారని [[దుర్గ]], [[శాంతి]] లను తిట్టి వెళతాడు. అభిమానం దెబ్బతిన్న దుర్గ, [[మేనమామ]] అయిన పి.వి. రావు నడిపే [[హొటల్]] ఎదురుగా తనొక హొటల్ పెట్టి అభివృద్ది చేసి [[ఆస్తిపాస్తులు|ఆస్తిపాస్తుల]]ను సంపాదించి మేనమామ హొటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. మనో వ్యాధితో మంచంపడతాడు పి.వి.రావు. శాంతికి అన్నపూర్ణ ప్రేమించిన సాయినాధ్ తో వివాహం నిశ్చయిస్తుంది దుర్గ. అది శాంతికి ఇష్టం లేక మేనమామ దగ్గరకు వెళ్ళి తన [[పెళ్ళి]] వేరే అతనితో జరగటం తనకిష్టం లేదని, బావను తప్ప వేరెవరినీ చేసుకోననీ చెబుతుంది. మార్పు చెందిన పీ.వీ.రావు శాంతికి అభయమిచ్చి తను చెప్పినట్టూగా చేయమని చెప్తాడు. అక్క నిర్ణయించిన పెళ్ళికి సిద్దమవుతుంది శాంతి. పి.వీ.రావు చలపతి, అన్నపూర్ణ, అన్నపూర్ణ తల్లి రమప్రభలతో కలసి పెళ్ళిలో చిన్న నాటకమాడి, పెళ్ళి కూతుళ్ళను మార్చి, అదే ఇంట్లో మేడమీద గదిలో శాంతి, సురేషుల పెళ్ళి జరుపుతాడు. అసలైన పెళ్ళి పందిరిలో అన్నపూర్ణ, సాయిచందుల వివాహం జరుగుతుంది. ఆఖరున పి.వీ.రావు నచ్చచెప్పడంతో దుర్గ కూడా రాజీ పడడంతో కధ సుఖాంతం అవుతుంది.
 
==పాటలు==
*పరువపు వలపుల సంగీతం... ఉరకలు వేసే జలపాతం - [[పి.సుశీల]]
*ముసిముసి నవ్వుల రుసరుసలు... చిరుచిరు అలకలే సరసాలు - పి.సుశీల
 
==చిత్ర విషేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెళ్లీడు_పిల్లలు" నుండి వెలికితీశారు