"మీనా" కూర్పుల మధ్య తేడాలు

28 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
 
మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]] లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] , [[మీనా]] జంటగా [[సుందర కాండ]],
[[చంటి]], [[సూర్య వంశం]], [[అబ్బాయిగారు]] వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/626794" నుండి వెలికితీశారు