వర్గం చర్చ:మానవ సంబంధాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
వియ్యంకుడు = వియ్యం పొందిన వాడు [[వియ్యంకుడు]]. ([[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]] జిల్లాలలో, వియ్యంకుడిని 'వీరకాడు' అని, వియ్యపురాలు (వియ్యంకుడు భార్య) ని 'వీరకత్తె' అని పిలుస్తారు. వధూ వరుల తలిదండ్రులు ఒకరికి ఒకరు వియ్యంకుడు, వియ్యపురాలు అవుతారు. వియ్యంకులు ఇద్దరూ బావా (బాగా దగ్గరి వారైతే) అని, బావ గారు అని పిలుచుకుంటారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ వదిన అని (బాగా దగ్గరి వారైతే), వదిన గారూ అని పిలుచు కుంటారు.
 
ఒకే కుటుంబలోని అక్క చెల్లెళ్లను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అన్నదమ్ములు అవుతారు. వరుసకు పెద్ద వారినిక్వారినిక అన్న గారు, అని , చిన్నవారిని తమ్ముడు గారు అని పిలుచు కుంటారు. ( బంధుత్వాలు చెప్పేటప్పుడు, [[తోడి అల్లుడు |తోడల్లుడు]] అని చెబుతారు. విశాఖపట్నం జిల్లాలో [[తోడల్లుడు]] ని [[జగిలీడు]] అంటారు.
 
ఒకే కుటుంబలోని అన్న దమ్ములను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అక్కాచెల్లెళ్ళు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అక్క (ఇక్కడ మర్యాద వాచకం 'గారు ' ఉండదు), అని , చిన్నవారిని చెల్లి లేదా చెల్లాయి అని పిలుచు కుంటారు. ( బంధుత్వాలు చెప్పేటప్పుడు, [[తోడి కోడలు ]] అని చెబుతారు. [[తోడికోడళ్ళు]] సినిమాలో మానవ సంబందాలు చూపించారు.
 
[[మేనత్త]] : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని [[మేనత్త]] అని పిలుస్తారు. మేనత్త భర్త [[మావయ్య ]] అవుతాడు. [[మేన మామ]] కాడు.
 
[[మేనమామ]]: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు [[మేనమామ]] అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది [[మేనత్త]] కాదు.
 
ఇక్కడ [[మేన ]] పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు.[[వాడుకరి:Talapagala VB Raju|Talapagala VB Raju]] 14:07, 27 జూలై 2011 (UTC)
Return to "మానవ సంబంధాలు" page.