పెండ్యాల నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Pendyala Nageswara Rao
పంక్తి 8:
 
==సినీ జీవితం==
పెండ్యాల ప్రతిభని పసిగట్టిన [[గాలిపెంచల నరసింహారావు]] [[మాయలోకం]] (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, [[దుక్కిపాటి మధుసూదనరావు]]గారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. [[గృహప్రవేశం (1946 సినిమా)|గృహప్రవేశం]] (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన [[కె.ఎస్‌.ప్రకాశరావు]] పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆ చిత్రానికి సంగీతర్శకుడు [[బాలాంత్రపు రజనీకాంతరావు]]. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారు గనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికి పూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]](1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారు ప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని '''కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు''' మొదలైన పాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతదర్శకుడుగా స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేత పాడించడం - పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగా వినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో '''ఘంటసాలని మించిన గాయకుడులేడు!'''. పెండ్యాల గారి వేలపాటల్లో - అది క్లబ్బుపాటైనా అందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులో తెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.
 
==చిత్రసమాహారం==
# ద్రోహి (1948) మొదటి రాత్రి (1950) దీక్ష (1951) మేనరికం (1951) కన్నతల్లి (1953) జ్యోతి (1954) మేనరికం (1954) దొంగరాముడు (1955) అంతే కావాలి (1955) మేలుకొలుపు (1956) పెంకి పెళ్ళాం (1956) ముద్దుబిడ్డ (1956) భాగ్యరేఖ (1957) అక్కా చెళ్ళెళ్ళు (1957) ఎమ్మెల్యే (1957) సౌభాగ్యవతి (1957) శ్రీకృష్ణ గారడి (1958)
 
==విశేషాలు==