ముత్యాలముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
ఇది [[తెలుగు సినిమా]] ఫ్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం. [[బాపు]] దర్శకత్వం, [[ముళ్ళపూడి వెంకటరమణ]] మాటలు, [[ఇషాన్ ఆర్య]] ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. [[రావు గోపాలరావు]] నటనలో ఒక కలికితురాయి.
== చిత్రకథ ==
 
 
ఈ చిత్రంలో ఉత్తర [[రామాయణం]] కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా ([[అల్లు రామలింగయ్య]]) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు [[ఆంజనేయ స్వామి]] అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
 
"https://te.wikipedia.org/wiki/ముత్యాలముగ్గు" నుండి వెలికితీశారు