ఆశ్లేష నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
* 4 పాదము - మీనరాశి.
=== ఆశ్లేషనక్షత్రము గుణగణాలు ===
ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత సర్పములు, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదో విధముగా కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, ప్రతీకారము కలిగి ఉంటారు. రాజకీయాల పట్ల ఆసక్తి అధికము. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. ఆటంకాల మద్య విద్యాభ్యాసము కొనసాగుతుంది. ప్రయత్నిస్తే ఆటంకాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసిమ్చగలరు.
వీరి పట్టుదల వీరిని ఊన్నత స్థితికి తీసుకువెలుతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్తపది సుఖజీవితాన్ని అలవరచుకున్నా అపోహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరమ్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యతులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మమ్చి పెరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.
లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, వస్త్రవ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు. వివాదాస్పద విషయాలకు దూరముగాఅ ఉంటారు. జీవితము స్థిరముగా జరుగుతుంది.
=== చిత్ర మాలిక ===
<gallery>
దస్త్రం:MesuaFerrea IronWood.jpg|ఆశ్లేష నక్షత్ర వృక్షము నాగకేసరి.
"https://te.wikipedia.org/wiki/ఆశ్లేష_నక్షత్రము" నుండి వెలికితీశారు