"గాజు (ఆభరణం)" కూర్పుల మధ్య తేడాలు

7,213 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''గాజులు''' ([[ఆంగ్లం]] Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే [[ఆభరణాలు]]. ఇవి [[గాజు (పదార్ధం)|గాజు]]తో గాని, [[ప్లాస్టిక్]], [[లక్క]] లేదా, [[బంగారం]]తో గాని తయారుచేస్తారు.
 
హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు.భారత దేశము మరియు ఆంధ్రదేశము హస్తకళలకు,చేతి వృత్తులకు ఒకప్పుడు కాణాచి. బ్రీటిషుపలనకు పూర్వము ఆంధ్ర గడ్డలో చేతి వృత్తులకు ఆపూర్వ ఆదరణ లభించినది.అగ్గిపెట్టెలో యిమిడె పట్టుచేరను నేసిన ఘనత మన తెలుగు నేతగాళ్ళది.అలాగే శిల్పకళ,చిత్రకళ,కుమ్మరి,కమ్మరి వృఇత్తులు కాడా ఆదరణ చెందాయి.బ్రీటిశు పాలనలో క్రమముగా పై వృత్తుల కళల ప్రాభాల్యం క్రమముగా సన్నగిల్లి అడుగంటిపోయాయి. నేడు నేతన్నలు అప్పుల ఊబిలో కారుకుపొయ్యి అత్మహత్యలు చేసుకుంటిన్నారు.
హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు.
 
అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఇకటి.మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు.చేతికి గాజులులేని స్త్రీలను వుహించలేము.స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము.స్త్రీలు ఆభరణాలపై,పట్టుచేరెల పై ఎంత మక్కువ చూపెదరో,గాజులపై అంతే మక్కువ చూపిస్తారు.గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము.ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి.గాజుల తయారి,అమ్మకం పై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.ఎక్కడ తిరునాల,లేదా జాతర జరిగిన మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మేదుఖాణాలు.గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కాడా గాజులమ్మేవారు కన్పిస్తారు.పూర్వకాలములో ప్రత్యేకముగా ఒకకులము(గాజుల బలిజే)వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు.గాజుల వుత్పత్తిదారులనుండి గాజులను టోకులో కొనుగోలున తెచ్చుకుని వూరూరతిరుగుచు,ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు.పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన,శ్రీమంతము జరిగిన,లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని,ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని,వారికి నమస్కరించి,తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు.ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారుకాని,మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వచ్చిన శ్భకరమని,వెళ్ళెకార్యాము జయప్రదముగా జరుగుతుందని భావిస్తారు.ఆధునీక కాలములో వాచ్చిన పెను మార్పుల కారణముగా వూరూరతిరిగి గాజులమ్మే వారు కనుమరిగైపోయారు.కాని గాజుల వాడకం మారలేదు,తగ్గలేదు.అధునాతనంగా,పారిశ్రామికంగా దేశము మారినను,ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతు,కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాది కల్పిస్తున్నది.వేదకాలం నాటి కన్న ముందే స్ర్తీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారలను బట్టి తెలుస్తున్నది.మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణంధరించినస్త్రీ చిత్రాలున్నాయి.యక్షిణిచిత్రాలలోని కూడా యక్షిణి చేతికి కంకణం ధరించినది.బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు(కంగణ్‌)ధరించినట్లుగా పెర్కొన్నాడు.పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద,మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి.అజంతా చిత్రాలలోని,ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు(కంగణ్‌)ధరించడం కన్పిస్తున్నది.B.C.230-100 నాటికే సిందులోయలో గాజులు ధరించెవారని తెలుస్తున్నది.జానపదపాటలలో,కావ్యాలలో,సాహిత్యములో గాజుల ప్రస్తవన విస్రుతముగా కన్పిస్తున్నది.సిక్కులు తమ మతాచారం లో లోహంతో చేసిన గాజును ధరించెదరు.దానిని 'కడ'(kada)అంటారు.చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు(Glass)తో చెయ్యడం వలన "గాజులు" అనేపేరు తెలుగులో రూడి అయ్యింది.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630811" నుండి వెలికితీశారు