గాజు (ఆభరణం): కూర్పుల మధ్య తేడాలు

3,055 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
అలాగే పూర్వకాలంలో రాజస్తాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్తు నుంచి,ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు.అలాధరించడం వలన తన కుటుంబానికి,భర్తకు,మరియు సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము,విశ్వాసం.పశ్చిమ బెంగాల్‌లోచిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా వున్నది.నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా,ముంజేతి వరకు తెల్లటి,వెడల్పాటి చెక్కతో లేదా వెదురు తో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును.స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా,మూడుపులుగా సమర్పించెదరు.కలకత్తలో కాళి దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు.మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటరు.
దక్షిణభారతదేశములో స్త్రీ గర్బవతిగా వున్నప్పుడు,పుట్టింటి వారు 'శ్రీమంతము'లో ఒకచేతికి 21 గాజులు,మరోచేతికి 22 గాజులు తొడుగుతారు.గాజుతో చేసె గాజులపరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్యాయించారు.ముఖ్యముగా ఫెరొజాబాద్‌లో గాజుల పరిశ్రమ అబివృద్ది చెందుటకు కారణము మొగలు సుల్తాను లు యిచ్చిన ప్రోత్యాహమే కారణము.
 
===గాజుల తయారి=== గాజులనుచెయ్యుటకు, మాములుగా యితర గాజు(glass)వస్తువులను తయారు చేసె ముడిగాజునే ఉపయోగిస్తారు.'ఫర్నెస్'లో ముడి గాజును బాగా కరగువరకు వేడిచేసి అందులో ఒక గొట్టం(pipe)ను ముంచి బయటకు తియ్యుదురు.గొట్టం చుట్టు కరగిన గాజు స్తూపాకరం(cylinderical)గా ఏర్పడును.ఇలా ఏర్పడిన స్తూపాకారవలయ గాజును గోట్టం మీద వుండగానే,గాజు గట్టిపడకముందే నెమ్మదిగా కొట్తి సమఆకారంగా ,సమ మందంగా, వుండేటట్లు చేస్తారు.యిప్పుడు మరో ఫర్నెస్లో యాంత్రికంగా,నెమ్మదిగా తిరుగుచున్న రోలరుకూ పై భాగములో,గోట్టముపై వున్న గాజును వేడి చేసి ,రోలరుయొక్క పై భాగంకు తాటించెదరు.యిప్పుడు,గొట్టం మీది గాజు రోలరు మీద సన్నని దారాలవలే వలయాలుగా(circular rings)ఏర్పడును.చూడటనికి ఈ స్దితిలో 'స్ప్రింగ్'వలే వుండును.ఈ వలయాని నిలువుగా' డైమండ్ కట్టరు'ద్వారా కట్ చేస్తారు.యిలా కట్ చెయ్యడం వలన రెండు చివరులున్న రింగులుగా ఏర్పడును. ====జుదాయి(judai)==== 'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడంజరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అందురు.కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి,వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా ,రెండుచివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు.ఏక్కువ గా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630859" నుండి వెలికితీశారు