సుభాష్ చంద్రబోస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు [[గారిబాల్డీ]] (''[[:en:Giuseppe Garibaldi|Giuseppe Garibaldi]]'') మరియు [[మాజినీ]] (''[[:en:Giuseppe Mazzini|Giuseppe Mazzini]]'')ల ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం [[ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్]] (''[[:en:Kemal Atatürk|Kemal Atatürk]]'') నాయకత్వంలోని [[టర్కీ]] దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్‌తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో [[అట్లీ]] నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.
 
==దేశం వీడి అగ్జ్ఞాతంఅజ్ఞాతం లోకి==
 
బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఈ నిర్ణయం పట్ల పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రాంభించాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల [[నిరాహార దీక్ష]] తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక [[పఠాన్]] లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా [[పెషావర్]] చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్‌ల సహకారంతో [[ఆఫ్ఘనిస్తాన్]] లోంచి [[కాబూల్]] ద్వారా ప్రయాణించి [[సోవియట్ యూనియన్]] సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్‌తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే [[:en:NKVD|NKVD]]అతనిని [[మాస్కో]]కు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను [[బెర్లిన్]] పంపాడు. అక్కడ బోస్‌కు రిబ్బెన్‌ట్రాప్ నుండి, మరియు విల్‌హెల్మ్‌స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.<ref>Kurowski, The Brandenburgers - Global Mission, p. 136</ref>
"https://te.wikipedia.org/wiki/సుభాష్_చంద్రబోస్" నుండి వెలికితీశారు