మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి” గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులోని 45మంది45 మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దం లో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో, రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషి” అని నామకరణం చేసారు. 2001 సంవత్సరంలో “అజొ. విభొ ప్రచురణల” ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది. నలభై ఏళ్ల క్రితం “ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక”లో(1962-64లో) శ్రీ [[తిరుమల రామచంద్ర]] గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవితవిశేషాలనుజీవిత విశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు.
 
పుస్తకంలోని ఆకర్షణీయమైన అంశం – ఆయా వ్యక్తుల అపురూప ఛాయా చిత్రాలు. ఈ ఛాయా చిత్రాలు తీయటం ద్వారా శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తెలుగువారికి చేసిన మేలు వర్ణించలేనిది. ఈ పుస్తకంలో పొందుపరిచిన ఆంతరంగిక చిత్రాలు కానీ, ఫోటోలు కానీ మరెక్కడా మనకు లభించవు. ఎంతో విలువైన ఫోటోలు అవి. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సహకారంతో మురళీధర్ గారిని ఆ ఫోటోల తాలూకు నెగెటివ్స్ ను ప్రచురణకు ఇవ్వటానికి ఒప్పించారు అప్పాజోస్యుల సత్యనారాయణగారు. పత్రికలో ప్రచురించిన తిరుమల రామచంద్రగారి వ్యాసాలకు మరిన్ని వ్యాసాలు అవసరమైతే; మల్లాది కృష్ణానంద్ గారు మరొక పదహారు మంది ప్రముఖుల జీవిత చిత్రాలను రాసి అందించగా, మొత్తం 45మంది మహనీయులతో ఈ పుస్తకం తయారైంది. పుస్తక రూపకల్పనకు, ప్రచురణకు కారకులు డా. అక్కిరాజు రమాపతిరావుగారు. అందమైన ముఖచిత్రకల్పన చేసిందేమో ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు.
"https://te.wikipedia.org/wiki/మరపురాని_మనీషులు" నుండి వెలికితీశారు