జ్యేష్ట నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
* 4 వ పాదము - మీనరాశి.
=== జ్యేష్టానక్షత్రము గుణగణాలు ===
జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయముగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు సక్తి లెకున్నానుకున్న కార్యము సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావము కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యము చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధము కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడములో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగెఅలాగే మోసము చెస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషము పెంచుకుంటారు. విసేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానె కనిపిస్తాయి. భాషలకు భాష్యము వ్రాయగలిగిన పాండిత్యము కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవమ్తమైన ఉద్యోగము, అన్యోన్య దాంపత్యము వీరికి సుఖమును కలిగిఉస్తుంది. సంతానము నష్తము కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపము ఊండదు. అన్నమాత, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వము, శాశ్వత స్నెహము ఉండదు. సాంకేతిక రంగములో ప్రత్యేక విభాగములో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరముగా ఉంటే జీవితము సాఫిగా సాగుతుంది. బాల్యము నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకము కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభి వృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనమును భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరము ఎంతైనా ఉంది. వృద్ధాప్యములో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రములో గ్రపరిస్థితులను అనుసరిమ్చి ఫలితాలలో మార్పులు ఉంటాయి.
=== ఇతర వనరులు ===
{{తెలుగు పంచాంగం}}
[[వర్గం:నక్షత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/జ్యేష్ట_నక్షత్రం" నుండి వెలికితీశారు