"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

==== గాంధారి ద్రౌపదిని ఓదార్చుట ====
ఆ మాటలకు [[ద్రౌపది]] దుఃఖ భారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని [[ద్రౌపది]]ని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీ దేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు.ఇలా జరుగుతుందనే [[విదురుడు]] కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నే ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధి విలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని [[ద్రౌపది]] ఓదార్చింది.
==== బయటి లింకులు ===
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/634930" నుండి వెలికితీశారు