కుసుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
కుసుమ (ఆంగ్లం: సాఫ్లవర్) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్. ఇది చాలా కొమ్మలు కలిగిన ఏక వార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 150 సెం.మీ. ఎత్తు వరకూ పెరుగుతాయి. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.
 
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
 
[[వర్గం:ఆస్టరేసి]]
"https://te.wikipedia.org/wiki/కుసుమ" నుండి వెలికితీశారు