శ్రీకృష్ణావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==చిత్ర కథ==
భాగవత, భారతాలను ఆధారం చేసుకుని, శ్రీకృష్ణుని కథలు అనేక కథలు, నాటకాలు, సినిమాలు కళారూపాలుగా వచ్చాయి. శ్రీకృష్ణలీలలు, కృష్ణమాయ, యశోదకృష్ణ, శ్రీకృష్ణతులాభారం, శ్రీకృష్ణవిజయం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణాంజనేయయుద్ధం, పాండవవనవాసం, శ్రీకృష్ణపాండవీయం వంటి అసంఖ్యాక చిత్రాలు వచ్చాయి. శ్రీకృష్ణావతారం చిత్ర ప్రత్యేకత. అష్టమ గర్భంలో జన్మించే శిశువు వల్ల అతనికి మరణం సంభవిస్తుందని తెలియజేస్తుంది. కంసుడు (ముక్కామల) సోదరిని సంహరించబోగా వసుదేవుడు తమ సంతానాన్ని అతనికి అప్పగిస్తామని ఒప్పుకోగా వారిని తన రాజ్యంలో కారాగారంలో ఉంచి ఒక్కొక్క శిశువును సంహరిస్తూంటాడు. ఎనిమిదవ శిశువును యశోద దగ్గరవుంచి యోగమాయ ను శిశువు స్థానంలో ఉంచుతాడు. యోగమాయను చంపబోగా అతనిని సంహరించే శిశువు వేరే చోట పెరుగుతున్నాడని చెబుతుంది. రేపల్లె లో కృష్ణలీలలు, పూతన, చక్రాసురుడు వంటి వారిని చంపటం, కాళీయమర్దనం, కంససంహారం జరుగుతుంది.(’జయహే’[[జయహే కృష్ణావతారా’కృష్ణావతారా]]’ అనే పాట నేపధ్యంగా ఈ కథ అంతా జరుగుతుంది). తరువాత రుక్మిణి (దేవిక), జాంబవతి, సత్యభామ (కాంచన) లను కృష్ణుడు వివాహమాడుటాడు. (సత్రాజిత్ ప్రహసనం, జాంబవంతునితో యుద్ధం తరువాత). నారదుడు (శోభన బాబు) కృష్ణుని అష్టభార్యల తోఅష్టభార్యలతో కాపురాన్ని పరీక్షిస్తాడు. కుచేలుడు కృష్ణసందర్శనానికి వస్తాడు. కుచేలుడ్ని, అష్టభార్యల సమక్షం లో కృష్ణుడు సేవిస్తాడు. తాను తెచ్చిన కానుక చూపడానికి బిడియపడుతున్న కుచేలుని దగ్గరనుండి అటుకులు స్వీకరిస్తాడు. చిత్రం లో బిగి ఈ సన్నివేశం నుండే ప్రారంభమౌతుంది. అప్పటి వరకు కృష్ణలీలలు, ప్రణయాలతో సాగిన చిత్రం ఇక్కడనుండి భాగవతంనుండి మహాభారరతంలోకి ప్రవేశిస్తుంది. చిత్రం సగభాగం వరకూ పాండవులు కనిపించరు. కౌరవపాండవులు ప్రవేశం 'పాండవోద్యోగ విజయం'లోని పడకసీను తో ప్రారంభమౌతుంది. తిరుపతి వేంకట కవుల నాటక పద్యాలను విరివిగా చిత్రంలోఉపయోగించారు. రాయబారం చిత్రీకరణలో మిగతా చిత్రాలకు భిన్నంగా రాయబారం మూడు రోజులు సాగినట్లు చూపడం చిత్ర ప్రత్యేకత. సుమారు 60 నిముషాలు చిత్రం సాగే రాయబారం లో కర్ణుని పాత్ర, అశ్వత్థామ పాత్రలకు పద్యాలు, సంభాషణలు చిత్రీకరింపబడ్డాయి. దానవీరసూర కర్ణలో కర్ణుని పాత్రకన్నా ఈ చిత్రంలో కర్ణ పాత్రకు ఎక్కువ సంభాషణలు, పద్యాలు వుండటం విశేషం. కురుక్షేత్ర యుద్ధానంతరం ధృతరాష్ట్రుని వద్దకు పాండవులు రావటం, ధృతరాష్ట్ర కౌగిలి చిత్రీకరణ, చిత్తూరి నాగయ్య అమోఘ నటన కూడా పేర్కొనదగినది. గాంధారీ శాపం తద్వారా యదుకుల వినాశం , కృష్ణ నిర్యాణం తో చిత్రం ముగుస్తుంది.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణావతారం" నుండి వెలికితీశారు