వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
== వంట నూనెలతో సర్వరోగాలు ==
నూనెలోఅధికశాతంలో ట్రాన్స్ ఫ్యాట్ ఆమ్లాలున్నట్లు సీ.ఎస్.ఈ. అధ్యయనంలో వెల్లడయ్యింది. ట్రాన్స్‌ఫ్యాట్ ఆమ్లాలు రక్తంలో ఆరోగ్యకరమైన కొవ్వును తగ్గించడం వల్ల హృద్రోగాలు పెరిగే ప్రమాదముంది. డయాబెటిస్, అల్జీమర్స్, మహిళల్లో సంతాన సమస్యలు, రొమ్ము కేన్సర్ లాంటి రోగాలు రావడానికి కూడా అవకాశముంది. కానీ వంట నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో కంపెనీలు వాటి స్థాయిని తగ్గించడం లేదు. దాదాపు అన్ని కంపెనీల వనస్పతిలోనూ హానికారక ట్రాన్స్‌ఫ్యాట్లు నిర్దేశిత ప్రమాణం 2 శాతం కంటే 12 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆవనూనెలో ఇది ఒక శాతం కంటే తక్కువగా ఉండడంతో పాటు అవసరమైన శాతంలో ఒమెగా 3, 6, 9 లాంటి మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలింది. నూనెలలో సంతృప్త, మరియు అసంతృప్త ఫ్యాటి అమ్లములు వుండును. అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు ద్విబంధం కలిగి వుండును. అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ల ద్విబంధాలు సిస్ లేదా ట్రాన్స్ అమరిక కలిగి వుండును. మనం వాడే వంట నూనెలలోని అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువగా సిస్ అమరిక కలిగి వుండును. అయితే నూనెను పలుమారులు వాతవరణ ఉక్ష్ణోగ్రతలో వేడచెయ్యడం వలన సిస్ అమరిక ట్రాన్స్ అమరికగా మారుతుంది. అలాగే నూనెలను వనస్పతిగా తయారు చెయ్యునప్పుడు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త ఫ్యాటి అసిడ్ లు ట్రాన్స్ ఫ్యాటి అసిడ్ లుగా మారును. <ref>[http://www.eenadu.net/story.asp?qry1=10&reccount=41]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు