నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నండూరి రామమోహనరావు''' (24 ఏప్రిల్ 1927-2 సెప్టెంబర్ 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]]లోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
== జీవితం==
నండూరి రామ్మోహనరావు కృష్ణాజిల్లా విస్సన్నపేట లో 1927 ఏప్రిల్ 24న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో హైస్కూలు విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లో "[[ఆంధ్రపత్రిక]]"లో పనిచేశారు. 1960-1994 దాకా [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఈ మధ్యలో "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
 
==రచనలు==
Line 24 ⟶ 27:
* విచిత్ర వ్యక్తి (మూలం: మార్క్ ట్వేన్ రచన - మిస్టీరియస్ స్ట్రేంజర్)
* బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం)
 
==రిఫరెన్సులు/సంప్రదింపు లంకెలు==
నండూరి రామ్మోహనరావు జీవిత విశేషాలు - పుస్తకం.నెట్ వ్యాసం (http://pustakam.net/?p=8125)
 
[[వర్గం:తెలుగు రచయితలు]] [[వర్గం:తెలుగు పాత్రికేయులు]]
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు