కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
kaaTaM laxminaarayana freedom fighter
పంక్తి 3:
స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత గారి పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడ మనమనికి వచ్చాయి. 1942 అక్టోబరు 12 న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము పోలీసులు లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయన సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు రామ కృష్ణారావుని, లక్ష్మినారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామకృష్ణా రావుని గురువుగా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలలపాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో వున్నారు. వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడ పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రేరణతో 1945 లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్య దర్క్షిగా పని చేశారు.
 
భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది, కాని నైజాము స్టేటులో విముక్తి లబించలెదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని 1947 ఆగస్టు 15 న బూర్గులవారి తో కలిసి మద్రాసు చేరి [[రష్యా]], [[అమెరికా]], [[ప్రాన్సు]] వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి [[హైదరాబాదు]]లో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. [[కొండా వెంకట రంగారెడ్డి]]కి లక్ష్మినారాయణ అంటే చాల ఇస్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిచయాలుండేవి. 1947 మే నెల 11 న పెళ్లి చేసుకొన్న లక్ష్మినరాయణ నాలుగు నెలలకె మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడం, అరెస్ట్ కావడం, తిరిగి రావడం, మళ్లి జైలుకెళ్లడం నిత్య కృత్యం అయింది. 1947 మే నెల 11 న పెళ్లి చేసుకున్న లక్ష్మినారాయణ నాలుగు నెలలకే మళ్ళి అరెస్ట్ అయాడు. నైజాము స్టేట్ భారత్ లో విలీనం తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి నప్పుడు., లక్ష్మినారాయణ రాజకీయ పదవులకు పాకు లాడ లేదు. ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాష్ట్ర పునర్ నిర్మాణానికి 1949 డిసెంబరులో ' జనత" పేరుతో ఒక పత్రికను ప్రారంబించాడు. గతంలో రజాకార్ల చేతిలో హతుడైన షోయబుల్లా ఖాన్ తో కలిసి పత్రికా రంగంలో పని చేసిన అనుబవం ఇప్పుడితనికి బాగ ఉపకరించింది. అంతే గాక రైతుల సమస్యల పరిష్కారానికి 1952 లో రాష్ట్ర కర్షక సంఘాన్ని స్థాపించారు. తెలుగు భూమి అనే మరొ పత్రికను 1969 లో ప్రారంబించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సమైఖ్య వాదిగా తన గళాన్ని వినిపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు అకాడమి లాగ హింది అకాడమి ఉండాలని ఉద్యమించి ప్రభుత్వాన్ని ఒప్పించి స్థాపించి దానికి తానె ఉపాద్యక్షులయారు. 1968 లో హైకోర్టు వెనుకబడిన వర్గాలకు రెజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇవ్వగా దాంతో బలహీన వర్గాల నాయకులందరిని ఒక తాటిపైకి తెచ్చి ఒక కార్య వర్గాని ఎర్పరిచి దానికి కన్వీన్రు అయి సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పు ను రద్దు చేయించారు. ఆ సందర్బంలో ఒక మహా సభ ఏర్పాటు చేయించారు. దానికి లక్షలాది మంది రాగ సాక్షాత్తు ప్రదాన మంత్రి ఇందిరా గాంది కూడ తరలి వచ్చారు. లక్ష్మి నారాయణ సాధించిన ఘన విజయాలలో ఇది ఒకటి. స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది. స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కుంటున్న నైజాము స్టేటు లోని యోధులకు ఆ అవకాశం రాలేదు. వీరికి కూడ ఆ అవకాశం రావాలని లక్ష్మినారాయణ కేంద్ర ప్రభుత్వం తో చర్చలు జరిపారు. కేంద్రం దానికి అంగీకరించ లేదు.
 
[[వర్గం:రంగారెడ్డి జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/కాటం_లక్ష్మీనారాయణ" నుండి వెలికితీశారు