ఉల్బక ద్రవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఉల్బక ద్రవం యొక్క పరిమాణం పిండం పెరుగుతున్నకొద్దీ పెరుగుతుంది. ఇది 34 వారాల [[గర్భావధి కాలం]]లో అత్యధికంగా అనగా సుమారు 800 మి.లీ. ఉంటుంది. తర్వాత కొంత తగ్గి [[కానుపు]] సమయానికి 600 మి.లీ. ఉంటుంది.
 
కానుపు సమయంలో గర్భాశయం యొక్క సంకోచాల వలన కలిగే ఒత్తిడి మూలంగా ఉల్బపు పొర చిరిగి ఉమ్మనీరు పోతుంది. కొన్నిసార్లు వైద్యులు పిండం పరిస్థితి సరిగా లేనప్పుడు ఈ పొరను ముందుగానే కత్తిరించి ఉమ్మనీటిని పోయేటట్లుగా చేస్తారు. ఇందువలన కానుపు త్వరగా అవడానికి వీలుంటుంది.
 
==వ్యాధి నిర్ధారణ==
ఈ ఉల్బక ద్రవాన్ని బయటికి తీసి కొన్ని పరీక్షలు జరపడం వలన పిండం యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుస్తాయి. జన్యు సంబంధమైన లోపాలను కూడా దీనిలోని కణాలను పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/ఉల్బక_ద్రవం" నుండి వెలికితీశారు