"వేరుశనగ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
*గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
*1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిదారక ఫలాలు.
 
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో రాయల సీమలో వేరుశనగ సాగు అధికము.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది.పంటను విత్తు సమయములో 12.5-17.5 సెం.మీ.,పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్‌ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుచున్నది. దక్షిణ భారతములో ఖరీప్‌,మరియు రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చెయ్యుదురు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచెయ్యుదురు. వేరుశనగలో నూనె,ప్రోటీనులు, కార్బోహైడ్రెట్‌లు, మరియు విటమిన్లు అధిక ప్రమాణములో వుండును. అందుచే వేరుశనగ బలవర్దకమైన ఆహరం. వేరుశనగ గింజలో(Kernel)43-50% వరకు నూనె,25-30% వరకు ప్రోటిన్లు వుండును.వేరుశనగ విత్తనంలనుంది నూనె తీసినతరువాత ఆయిల్‌ కేకులో(నూనె తీసిన వేరుశనగ విత్తనంల పిండి) ప్రోటీన్‌శాతం పెరుగును. వేరుశనగ పంటకాలము,విత్తనం వైరైటిని బట్టి 90-150 రోజులు వుండును. గుత్తిరకము (Bunch type) పంటకాలము 90-120 రోజులు. వ్యాప్తి (spreading Type) రకము విత్తనము అయ్యినచో పంటకాలం 130-150 రోజులు వుండును. పై రెండు రకాలను ఎక్కువగా వర్షకాలం (ఖరీప్‌)లోనే సాగు చెయ్యుదురు. చీడ, పీడలను తట్టుకునే శక్తి గల సంకరజాతి (Hybride) వంగడాలను సాగుచెయ్యడం వలన 20% ఎక్కువ దిగుబడి సాధించవచ్చును. మాములు రకము ఎకరానికి 500-600 కేజిలు దిగుబడి యివ్వగా, హైబ్రిడ్‌ రకము 900-1200 కేజిలు గిగుబడి యిచ్చును.వేరుసనగ కాయ (pod)లో పొట్టు (shell)25-30%, గింజ(Kernel) 70-75% వుండును.
 
==హైబ్రిడ్ వేరుశెనగ రకాలు==
కొన్నిరకాల [[హైబ్రిడ్‌]] రకాలను దిగువన పెర్కొనడ జరిగినది.
 
'''1. ICGS 11''':
యిది ఎక్కువ దిగుబడి యిచ్చు రకము. చీడపీడలను వర్షాభావ పరిస్దితులను బాగా తట్టుకునే రకము.ఎక్కువగా ఖరిప్‌లో సాగుచెయ్యుదురు.పంటకాలం 120 రోజులు.మహరాష్ట్రలో 1.5 టన్నులు,హెక్టారుకు దిగుబడి వచ్చినది.ఆంధ్ర,కర్నాటకలో ట్రయల్‌రన్‌లో 2.5 టన్నుల దిగుబడి వచ్చినది.కాయలో 70% గింజ వుండును.
 
'''2. ICGS 44''':
యిది కూడా ఎక్కువ దిగుబడి యిచ్చు రకం.పంటకాలం 120 రోజులు.వేసవి కాలంలో ఈ పంటను సాగు చెయ్య వచ్చును.వర్షాభావ పరిస్దితులను తట్తుకొగలదు.సరిగా సాగు చెసిన 3-4 టన్నులు,హెక్టారుకు దిగుబడి యిచ్చును.కాయలో గింజ 70%,పొట్టు 30% వుండును.
 
'''3.ICGV 86590''':
యిది బంచ్‌ రకమునకు చెందినది. పంటకాలము 96-123 రోజులు. చేడ, పీడలను తట్టుకోగలదు.దిగుబడి హెక్టారుకు 3 టన్నుల వరకు వున్నది. ఈ రకమును ఎక్కువగా ఆంధ్ర, కర్నాటక, కేరళ, మరియు తమిళనాడు లలో సాగు చెయుచున్నారు.
 
'''4.ICGV 91114 ''':
యిదికూడా బంచ్‌ రకమునకు చెందిన వంగడము.పంటకాలము 100 రోజులు.తీవ్రమైన వర్షాభావ పరిస్దితులను తట్టుకోగల వంగడం.పంట దిగుబడి 2.5-3 టన్నులు/హెక్టారుకు.గింజ పెద్దదిగా వుండును.
 
'''5.ICGV 89104''':
బంచ్‌రకమునకు చెందినది.పంటకాల్ము 110-120 రోజులు.అప్లొటాక్షిన్,అస్పరిగిల్లస్‌,ఫంగస్‌ వంటి వ్యాధులను నిలువరించ గలదు.దిగుబడి 2.0 టన్నులు/హెక్టరుకు.కాయలో 68% గింజ వుండును.
 
 
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/645851" నుండి వెలికితీశారు