పావగడ: కూర్పుల మధ్య తేడాలు

paavagada
 
paavagada
పంక్తి 4:
 
[[మరొక పావగడ]]
గుజరాత్ రాష్ట్రంలో బరోడాకు సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వున్నది. ఇక్కడ [[కాళీ మాత]] ఆలయం చాల ప్రసిద్ది పొందినది. ఈ ఆలయాన్ని [[విశ్వామిత్రుడు]] నిర్మించాడని, విగ్రహాన్ని కూకూడ అతనేతనే ప్రతిష్టింఛాడని భక్తుల విస్వాసం. ఈ పర్వతం పై విశ్వామిత్రునికి ఒక [[ఆశ్రమం]] వున్నది. కొండ దిగువన వున్న నదిని కూడ ఆయన పేరునే పిలుస్తారు. ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయానికి వెళ్లడానికి ఐదు కిలోమీటర్ల దూరం మెట్ల దారి లో వెళ్లాలి. అమ్మవారి విగ్రహం రక్త వర్ణం లో విప్పారిన నేత్రాలతో బయంకర రూపం కలిగి వున్నది. మూల విరాట్ కు ఒక వైపున పాలరాతి విగ్రహం, మరొక వైపు పాలరాయి పై చెక్కిన శక్తి యంత్రం దర్శనమిస్తాయి. దశరా నవరాత్రులలో ఈ క్షేత్రం భక్తులతో కిట కిట లాడు తుంది. నవ రాత్రుల సమయాన భక్తులు మట్టి కుండల్లో నవదాన్యాలను మొలకెత్తించి తొమ్మిది రోజులు పూజిస్తారు. ఎనిమిదో రోజున తొమ్మిది మంది రుత్త్విజులతో నవ చండీ యాగాన్ని నిర్వహించి పదో రోజున ఈ కుండలను ఆలయ సమీపంలో [[దుదియా చల్ల్వ్ తలావ్]] అనే నరస్సులో నిమజ్జనం చేస్తారు. ఈ సరస్సులోని నీరు పాల లాగ తెల్లగా వుంటుంది. ఈ సరస్సు నుండే సోపాన పంక్తి అనగా మెట్లదారి ప్రారంబం అవుతుంది. కొండ పైకి వెళ్లడానికి ఉయ్యాల మార్గంకూడ వున్నది. కొండ శిఖరానికి దిగువున భద్ర కాళి ఆలయం వున్నది. ఇందులోని విగ్రహం దక్షిణ ముఖంగా వుండగా ఎగువన వున్న ఆలయంలోమహాకాళి మూల విరాట్ ఉత్తరాభిముఖంగా వున్నది. ఈ ప్రాంతం కొంత కాలం ముస్లింల పాలనలో వున్నందున ఇక్కడ అనేక ముస్లింల కట్టడాలు వున్నాయి. [[మహాకాళి]] ఆలయానికి చేరువలో వెయ్యేళ్ల నాటి [[లకులీశ్]] మందిరం వున్నది. ఇది జీర్ణావస్తలో వున్నందున ప్రభుత్వం పునర్ నిర్మిస్తున్నది.
( మూలం: ఈనాడు ఆదివారం: 15 డిసెంబరు 2002)
"https://te.wikipedia.org/wiki/పావగడ" నుండి వెలికితీశారు