తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

//gadilu//
gadIlu
పంక్తి 1:
<big>[[తెలంగాణ గడీలు]]</big>
 
రాజులు, రాచరికాలు, అరాచకంగా రాజ్యాలేలిన చరిత్ర ప్రపంచ వ్యాప్తమే....... అది గతించిన కాలం. మన దేశంలో రాచరిక వ్వవస్త రూపు మాసి పోయి శతాబ్దాల కాలమే అయినది. [[బ్రిటిష్]] వారి పాలనలో మెల్లి మెల్లిగా రాచరికపు వ్వవస్త రూపు మాసి పోయింది. దేశం మొత్తానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చినా ఈ దేశంలోని మూడు సంస్థానాలలోని ప్రజలు స్వాతంత్రానికి నోచుకోలేదు. ఆయా సంస్థానాల రాజులు మొండి పట్టుదలతో స్వాతంత్ర భారత్ లో కలవ డానికి ఒప్పుకోలేదు. అవి [[హైదరాబాద్ సంస్థానం,]] [[కాష్మీర్ రాజ్యం]], [[జునాఘడ్ సంస్థానం]]. కాష్మీర్ రాజ్యంలో ప్రజలందరు ఎక్కువగా ముస్లింలు అయితే రాజు మాత్రం హిందువు. కాని హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరు ఎక్కువగా హిందువులైతె రాజు మాత్రం ముస్లిం. హైదరాబాద్ [[నైజాం]] తన రాజ్యాన్ని పరిపాలన సౌలబ్యంకొరకు చిన్న చిన్న విభాలుగా చేసి ఆ ప్రాంతాన్ని ఒక 'దొర' చేతిలో పెట్టాడు. ఆ దొర ఆ ప్రాంతానికి జమీందారు. పరిపాలన అంతా అతని కనుసన్నలలోనె జరిగేది. అతనొక నియంత, క్రూరుడు. ప్రజలను పీడించుకు తినె వాడు. ఆ 'దొర' సంవత్సరాని ఇంత అని నిజాంకు [[కప్పం]] కట్టే వాడు. స్థానికి పరిపాల అంతా తన ఇష్ట ప్రకారమే జరిపేవాడు. అప్పటికే ప్రజలు నిజాం పైన, స్థానిక పాలకుడైన దొరల పైన కోపంగా వున్నారు. ఇంతలో భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను స్వతంత్ర భారత్ లో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దానిని వ్వతిరేకించిన నిజాము , అతని సహచరులు స్థానిక దొరలు ప్రజలపై పడి విపరీతంగా భాదించి దోచుకోవడం ప్రారంబించారు. దీంతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నిజాము పైన, స్థానిక దొరలపైన సాయుధ తిరుగుబాటు చేశారు. నిజాముకు మద్దతుగా కొన్ని దుష్ట శక్తులు, ప్రజలకు మద్దతుగా స్థానిక కమ్యునిష్టులుకమ్యూనిష్టులు, ఇతరులు, భారత ప్రభుత్వం నిలవగా ఏడాదికి పైగా ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్రం లభించింది.
 
నైజాం రాజ్యంలో స్థానిక పాలకులైన దొర లు నివాసాలకు, రాజరికపు అరాచకపు కార్యకలాపాలకు నెలవులైన కట్టడాలే గడీలు. అనగ చిన్న చిన్న కోటలే ఈ గడీలు. ప్రజల తిరుగుబాటు సమయంలో గడీల పాలకులైన దొర లు తమ భూములను, గడీలను వదిలి హైదరాబాద్ నగరానికి పారిపోయి నిజాం రక్షణలో ఆశ్రమం పొందారు.
ఆవిధంగా వెల్లిన దొరలు నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించ సాగారు. ఇప్పుడు భూములకు, స్థిరాస్తులకు విపరీతమైన విలువ పెరగడంతో ఆ మాజీ దొరలకు, లేదా వారి వారసులకు తమ గడీలు, తమ భూములు గుర్తుకొచ్చి తమ పల్లె బాట పట్టారు. తమ గడిలను, భూములను అమ్మకానికి పెట్టారు. కాని స్థానిక ప్రజలు ఆ గడిలు భూములు తమ శ్రమ దోపిడి పలితాలను కనుక అవి తమ ఉమ్మడి ఆస్తి అని దొరలకు అడ్డు తగులుతున్నారు. నిజాం లొంగు బాటు తో నిజాం పాలనా భవనాలు, ఇతర రాజరికపు కట్టడాలు ఎలా ప్రభుత్వం పరమైనాయే అదే విధంగ ఈ గడీలు,
దొరలు గడీలను వదిలి పట్నం చేరగా ఆలనా పాలనా లేని ఆ గడీలు అనాదలా మిగిలి పోయాయి. రాజారం గడీలో గుడ్లగూబలు, చపొఆల్తపాల్ పూర్ గడీలో గబ్బిలాలు, ముద్దనూర్ గడీలో గండు పిల్లురుపిల్లులు, దోమ కొండ గడీలో పాముల పుట్టలు నేరెళ్ల గడీలో ......."ఓస్త్రీ..... రేపు రా...." అనే రాతలు దర్శనమిస్తాయి. కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991 లో గ్రామస్తులు లూటీ చేశారు. పోలీసులు నూట ఇరవై మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు కూడ పెట్టారు. ఆవివాదం చాల ఏళ్లు నడిసింది. అయితె ఇటీవల కాలంలొ పల్లేల్లో సర్పంచులు, ''ఎంపిటీసీలు, జడ్పీటీసీలు'', మండలాద్యక్షులు వంటి రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. విద్వావంతులు పెరిగి పోయారు. ప్రజలలో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యమే గడీలను తమా ఉమ్మడి ఆస్తిగా బావించేలా చేస్తున్నది. దాని కొరకు ఎదురు తిరిగేలా చేస్తున్నది. తెలంగాణ కవి [[అన్నవరం దేవేందర్]] అన్నట్టు........"ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చ పడేది. ఇప్పుడు దాంట్లోనే పోస్తున్నం" గడీలన్ని ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగు బాటు చల్ చల్ గడీ తో ప్రారంబ మైనది.
 
దొరల భూములు తమ ఉమ్మడి ఆస్తులని ప్రజల వాదన. ఈ వాధనతో గత కాలపు గడీ ల చరిత్ర మరలా తెరపైకి వచ్చింది. ఆ గడీల చరిత్ర కొంతైనా తెలుసుకోవాలనుకునేతెలుసు కోవాలనుకునే తెలియని ప్రజలకొరకు ఈ వ్యాసం.
 
1. [[చల్ గల్ గడీ]]
కరీంనగర్ జగిత్యాల మండలంలో వున్న [[చల్ గల్ గడీ]] రాజుల కోటను తలపిస్తుంది. డంగు సున్నంతో నిర్మించిన ఆ గోడలు నేటికి చెక్కు చెదర లేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్థంభాలతో ఉండే ఆ గడి రెంటో అంతస్తు పైకెక్కి చూస్తే ఆ చుట్టూ అయిదారు కిలోమీటర్ల దూరం వరకు, పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణ భూపాల్ రావు అప్పట్లోనే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లి పోయాడు. చల్ గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలో వున్నందున అక్కడి భూములుకు విపరీతమైన విలువ వచ్చింది. దాంటో గడీ యజమాని గడీని అమ్మకానికి పెట్టాడు. కాని ప్రజలు వ్యతిరేకించారు. ఆ గడీని తమ గ్రామానికి విరాళంగా ఇమ్మని ప్రజలు కోరు తున్నారు.
 
[[బండ లింగా పూర్ గడీ]]
రంగా రెడ్డి జిల్ల ఇబ్రహిం పట్నం మండలంలో ఈ గడీ చుట్టుపక్కల వున్న జగ్గాసాగర్, అయిలాపఊర్, భీమారం తదితర ఎనబై గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్ వావ్రావ్ అధీనం లో ఉండేది. ఈ గడీలో అప్పట్లోనె అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసు కున్నారు. జర్మిని నుండి పాల రాతిని, ఇతర విలాస వంతమైన వస్తువులను తెప్పించి వాడారు. అప్పట్లోనే జనరేటర్ తో విద్యుత్ దీపాలను వెలిగించారు ఈ గడీలో. కిరోసిన్ దీపాలు కూడ లేని ఆ గ్రామ ప్రజలు గడీ లోని వింత వెలుగులను ఆశ్చ్యర్యంగావింతగా చూసేవారట. గడీలో తాగునీటిని పైపుల ద్వారా తెప్పింఛే వారు. ఆ కాలంలో నిర్మించిన నీళ్ల టాంకును ఈ నాటికి ప్రజలు ఉపయోగించు కుంటున్నారు. నక్స లైట్ల భయం వల్ల గడీ వైపు కూడ చూడని ఈ మాజి దొరలు గాని, వారి వారసులు గాని నక్స్ లైట్ ల ప్రబావం కొంత తగ్గగానే గ్రామానికొచ్చి కొన్ని స్థిరాస్తులు అమ్ముకొని పాత గడీని అమ్మేసి, కొత్త గడీని కూల్చేసి అందులోని విలువైన వస్తువులను, ఫర్నిచర్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లి పోయారు. బండ లింగా పూర్ సంస్థానంలో వాళ్లకు స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకొని వున్న స్థలాన్ని గ్రామాభివృద్ది కమిటీకి అప్పగించారు. కళ్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణు గోపాల స్వామి ఆల7యానికి "ఆండాళ్ దేవికిదేవి"కి నాలుగు లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కళ్యాణానికి సంస్థాన వారసులు గ్రామనికి వస్తారు. వ్వతిరేతక రాకుండా చూసు కోవడానికే దొరలు దాన ధర్మాలు చేస్తున్నారని విమర్శింఛె వారు లేక పోలేదు.
[[లింగన్న పేట గడీ]]
మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు కసిసే చోట కరీంనగర్ జిల్లా గంభీర్రావు పేటస్ మండలంలో వున్నదీ లింగన్న పేట సంస్థానం. ఐదు ఎకరాల విస్తీర్ణం గల ఈ గడీ గోతంటాల వెంకట నర్సింగరావు దొరకు చెందింది. వీరి ముందు తరానికి చెందిన దొర భార్య గుర్రం మీద గ్రామాల్లోకి వెళ్లి "కప్పం" వసూలు చేసుకొచ్చేదట. ఆమె చాల నిరంకుశం గా పరిపాలించేదని ప్రజలు చెప్పుకుంటారు. ఈ సంస్థానం లో ఏడు తరాలనుండి మగ సంతానం లేదట...... ఆనంద రావు అనే దొర తప్ప. ఎక్కువగా మనుమలను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దొరలను "సర్ దేశాయ్" లు అని కూడ అంటారు. ఈ గడికి నాలుగు వైపుల బురుజులున్నాయి. వాటి పైకెక్కి చూస్తే వాళ్లకు చెందిన నాలుగు వందల ఎకరాల భూములు, గ్రామాలు కనిపించేవి. [[సిరిసిల్ల]] పాత తాలూక లోని ఎక్కువ గ్రామాలు వీరి ఆధీనంలో వుండేవి. మల్లారెడ్డి పేట, ల్ముస్తాబాద్, కోళ్ళమద్ది శిరియాల, నాగంపేట, దమ్మన్నపేట, మొల్ల పల్లి, సిస్రిసిల్లసిరిసిల్ల మొదలైన గ్రామాఅలన్ని ఈ సంస్థానం కిందే వుండేవి. ఈ గడీలో ఎందరో దాసీలు, నలబై మంది జవాన్లు వుండేవారు.
 
ఈ గడీ ప్రత్యేకత ఏమంటే, ... గడీలోనె [[మాణిక్య ప్రభు పీఠానికి]] చెందిన రాజ [[రాజేశ్వరి దేవాలయం]] వున్నది. రెండు వందల సంవత్సరాల నుండి క్రమం తప్ప కుండా అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. అందుకు రామశర్మ అనే పూజారి కుటుంబం తొ ఇక్కడే వుంటారు. హైదరాబాద్ లో స్థిర పడిన గడీ యజమానులు పూజల నిర్వహణకు గాను పూజారికి ఏటా ఇరవైవేల రూపాయలను పంపిస్తున్నారు. దేవాలయ ఉత్సవాలు, బ్రంహోత్సవాలను గడీ వారసుల పేరున జరుగుతాయి. మొదట్నుంచి ఈ గడీలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఆయుద పూజ సమయంలో వెంకట నర్సింగ రావు దొర ముందు నడుస్తుంటే ఆయన వెనుక పల్లకిలో "రాజఖడ్గం " ఉరేగింపుగా తీసుకొచ్చేవారు. దసరా రోజు జరిగే ఆయుద పూజలో రాజ ఖడ్గం తప్పనిసరిగా వుండాల్సిందె కాబట్టి దాన్ని భద్రపరిచిన గది తాళం చెవి హైదరాబాద్ లో వున్న అదొర దొర వద్దనుండి పంపిస్తారు. చాల గడీలలో దసరా సందర్బంగా ఏటను "బలి" ఇస్తారు. కాని ఈ గడి లో రాజరాజేశ్వరీ దేవి ఆలయం వున్నందున జంతు బలి నిషేదించారు. ఈ గడీ ఆవరణం లోనె గ్రామ పంచాయితీ భవనం, పశు సంరక్షణ సమితి కార్యాలయం, పక్కన ఉన్నత పాఠశాల వున్నందున గడీ ఆవరణం అంతా జనంతో సందడిగా వుంటుంది. ఈ మద్యన కొంత శిధిలమైన ఈ గడీని ఐదు లక్షల రూపాయలతో మాజీ దొర మరమత్తులు చేయించాడు.
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు