ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''ప్లాస్టిక్‌''' (Plstic) పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చవు తుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్‌ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ [[భూమి]]లో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
 
==సమస్యలు==
ప్లాస్టిక్ అంతర్యంగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ మరియు రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు మరియు ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారుచేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పధార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహర పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్ మెంట్లలో ఉండే కాడ్మియము వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి
 
ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఈస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా [[కేన్సరు]] కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.
 
[[కాడ్మియం]] మరియు [[సీసం]] వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల మాన్యుఫేక్చరింగులో ఉపయోగించినప్పుడు కూడా శ్రవించి ఆహార పదార్ధాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులని మరియు గుండె పెద్దది కావడం కలగచేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.
 
==బంగాళాదుంపలతో ప్లాస్టిక్==
బంగాళాదుంపలతో క్యారీబ్యాగ్‌, స్పూన్స్‌లు, ప్లేట్స్‌, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు