పి.శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పి.శంకరరావు''' (P.Shankar Rao) కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. ఇప్పటివరకు శంకరరావు 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 4 సార్లు [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నిక కాగా 2009లో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి విజయం సాధించాడు.
==ప్రారంభ జీవితం==
శంకరరావు 1948 ఏప్రిల్ 20న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 02-12-20010</ref> వైద్యశాస్త్రంలో డీగ్రీ పూర్తిచేశాడు. స్థానికంగా మంచి డాక్టరుగా పేరు పొందినాడు. రాజకీయాలలో చేరిన పిదప వైద్యవృత్తికి స్వస్తి చెప్పాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మద్దతు ఇస్తున్నాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1969 తెలంగాన ఉద్యమం కొరకు పోరాడినాడు.
 
==రాజకీయ జీవితం==
శంకర్రావు తొలిసారిగా 1983లో షాద్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. 1989లో రెండోసారి అదే స్థానం నుంచి ఎన్నికకాగా 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన బక్కని నర్సిములు చేతిలో పరాజయం పొందినాడు. 1999లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు. 2004లో కూడా షాద్‌నగర్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసి బక్కని నర్సిములుపై విజయం సాధించాడు. [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి|వైఎస్సార్]] మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గం జనరల్‌కు మారడంతో 2009లో శంకర్రావు సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.శాయన్నపై 4 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.<ref>ఈనాడు దినపత్రిక, హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-5-2009</ref>
"https://te.wikipedia.org/wiki/పి.శంకరరావు" నుండి వెలికితీశారు