కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ln:Libóta
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
 
==పరిచయము==
ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం - '''కుటుంబము''' (Family). వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
 
 
"కుటుంబం" లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము (consanguinity), సహచరత్వము (affinity), ఒకే నివాసం (household /co-residence). ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.
 
 
కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాధమిక గుణం - శారీరికంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం.<ref>Schneider, David 1984 A Critique of the Study of Kinship. Ann Arbor: [[University of Michigan Press]]. p. 182</ref><ref>Deleuze-Guattari (1972). Part 2, ch. 3, p.80</ref> కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును.(enculturation and socialization).<ref>[[John Russon|Russon, John]], (2003) ''Human Experience: Philosophy, Neurosis, and the Elements of Everyday Life'', Albany: State University of New York Press. pp 61-68.</ref> అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది (family of procreation)<ref>George Peter Murdoch ''Social Structure'' page 13</ref>. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్ధికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది. <ref>Wolf, Eric
1982 Europe and the People Without History. Berkeley: [[University of California Press]]. 92</ref><ref>Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: [[the Hague]].</ref><ref>Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).</ref>
 
== ఉమ్మడి కుటుంబంలో లాభాలు==
*ప్రతీ వ్యక్తికీ ఆర్ధిక మద్దత్తు లభిస్తుంది
*నెల ఖర్చు భాగం తగ్గుతుంది
*సుఖం, సంతోషం ఇతరులతో పంచుకోవచ్చు
*ప్రతి రోజూ వేడుకగానే ఉంటుంది
*పెద్దల సలహాలు లభిస్తాయి
*బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు లభిస్తుంది
*విడాకులు, ఆత్మహత్యలు ఉండవు
*స్త్రీలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది
 
==ఉమ్మడి కుటుంబంలో నష్టాలు==
*వ్యక్తిగత స్వేచ్చకి కరువు
*కష్టం విలువ తెలియదు
 
== జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12ను [[జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం]]గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణావేదిక, భారతీయ కుటుంబ సంరక్షణా ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.(ఆంధ్రజ్యోతి11.11.2009)
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు