క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
== లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం-లక్ష్మీ కళ్యాణం ==
[[File:Sagar mathan.jpg|right|thumb|3000px300px|18వ శతాబ్దపు చిత్రం- క్షీరసాగర మథనం]]
ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా [[కామధేనువు]] పుట్టింది. తరువాత [[ఉచ్చైశ్రవము]], [[ఐరావతం]], [[కల్పవృక్షము]], [[అప్సరసలు]], [[చంద్రుడు]] , [[మహాలక్ష్మి]] పుడతారు. కామదేనువును, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని [[ఇంద్రుడు]] తీసుకొంటాడు. ఉచ్చైశ్రవాన్ని [[బలి]] చక్రవర్తి కి ఇస్తారు. మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు. సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి(శ్రీదేవి), దేవదానవులతో, "మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీమహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళి గా ఉంటాను" అని చెప్పి మహావిష్ణువు మెడ లో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు [[కౌస్తుభమణి]] ని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణి తో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలం పై విరాజిల్లచేశాడు. దేవదానవులు మళ్లీ మథనం ఆరంభించారు. అప్పుడు [[వారుణి]] (సుర లేదా కల్లు) పుట్టింది. వారుణి తమకు కావాలని రాక్షసులు అడుగగా వారుణి ని దానవులకు ఇస్తారు. క్షీరసాగర మథన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు ఉద్భవించాయి. అన్నింటినీ దేవతల లోని ముఖ్యులు పంచుకున్నారు. రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు, స్వేచ్ఛగా సురను త్రాగి, సాగర మథనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి(కాబోలు).
 
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు