తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
[[కొడిమ్యాల......రామాజీపేట గడీలు.]]..
 
కొడిమ్యాల గడీ, రామాజీ పేట గడీ.. ఈ రెండు గడీలు కూడ -[[కరీంనగర్]] జిల్లాలోనే వున్నది. మరే గడీకి లేని ప్రత్యేకత ఈ రెండింటికి వున్నది. అదేమంటే...... వీటిల్లో కొన్ని బొమ్మలు, చిత్రాలు వున్నాయి. [[కొడిమ్యాల గడీ]] నాలుగెకరాల విస్థీర్ణం లో వున్నది. ఈ గడీ రామక్క దొరసాని అధీనంలో ఉండేది. సుమారు ఐదు వందల ఎకరాల భూమి ఈమె ఆదీనంలో వుండేది. గడీ కున్న ఎనిమిది బురుజులు చాల వరకు పాడైనవి. ప్రహరి గోడ మట్టిది వెడల్పైనది. దానిమీద ఏడ్ల బండి పోగలిగేటట్లున్నది. ఈ గడీ వారసులు మంచి కళా పోషకులు, విద్యా వంతులు. ఒక తరానికి చెందిన మంగా రావు దొర పెద్ద కూతురు ఆనందబాయి [[అష్టావదానం]] చేసేది. అలగే ఇంకొ దొర లక్ష్మణ రారు జాతీయ స్థాయిలో [[హాకీ ప్లేయర్]] గావుండి.,1946--47 లో [[ఉస్మానియా యూనివర్సిటీ]]గ్ తరుపున ఆడి అనేక పతకాలు సాదించారు. ప్రస్తుతం ఈ గడీ ఆవరణంలో ఒక బ్యాంకు వున్నది. కడి మేడ అనే పేరున్న ఈ వూరు కడమలగా ఆతర్వాత కడిమ్యాల గా రూపాంతరం చెందింది.
ఈ గడి ని బలిజ కులస్థులైన ద్లొరలు పాలించారు. కాని వీరు నైజాముకు వ్వతిరేకులు. అందుచేత ఈ గడి ని నైజాము చేజిక్కించుకొని వేరొకరికి అప్పగించాడు. ఈ గ
 
డీ లో సూర్యుని బొమ్మ, సింహం బొమ్మలున్నాయి. గడి దర్వాజ పై పులి, సింహం పోరాటానికి సిద్దంగా వున్నట్టున్నాయి. గడీ గోడలపై ఆంజనేయుడు, సీతమ్మ బొమ్మ, గుర్రాలపై తుపాకులతో జింకను వేటాడుతున్న ఒక బొమ్మ, ఏనుగును ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లుతున్నట్లున్న మరొ బొమ్మ, రాజ ముద్రలో నెమలి బొమ్మ, అప్పటి రైలు బండి బొమ్మ పైకప్పుకు అతి పెద్ద, సూర్యుడు, చంద్రుని బొమ్మలున్నాయి. వీటి అర్థం ఎవ్వరికి తెలియదు. బలిజల దొరల పుణ్యక్షేత్రమైన కొండగట్టు వరకు గడీ నుండి స్వరంగ మార్గముండేదని అదిప్పుడు కూరుకు పోయిందని చెప్తారు. గడి పైభాగంలో దొరలు కూర్చొని చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించడానికి ఒక రాతి సింహాసనం వున్నది. ఈ గడీ మీద ఒకసారి నక్జలైట్లు దాడి చేసి ఆయుదాలన్ని ఎత్తుక పోయారు. మంగారావు దొర పాలనలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఎనిమిది బురుజుల వద్ద, మదియు గడిలోతొమ్మిది ఏటలను బలి ఇచ్చేవారు. ఆమాంసాన్ని వూరంతా పంచేవారు.
[[రామాజీ పేట గడీ]] ఇది చిన్నదే అయినా చాల కళాత్మకంగా వున్నది. గడీ ప్రవేస ద్వారంపై మూడు తుపాకుల బొమ్మలు, ఒక గడియారం బొమ్మలున్నాయి. దాని ప్రక్కనే ఒక చట్రంలో నాలుగు నక్షత్రాల బొమ్మలున్నాయి. గడీ తలుపులకు కూడ కళాత్మకమైన చిత్రాలున్నాయి.
=వనరులు==
<references/> ( కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర అనే పరిశొధకుల వ్వాసాలను ఆంధ్ర జ్యోతి ఆదివారి నాటి పత్రికలో 2011 లో ప్రచురితమైన వ్యాసాలు మూలం:)
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు