శ్రీ వెంకటేశ్వర మహత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
}}
== చిత్రకథ ==
లోక కల్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో ఆవిష్షును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహార్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదం లో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతి తో తాండవంతో మునిగి భృగు రాకను గమనించడు.. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకంఠానికి వెళతాడు..లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాక గమనించడు..భృగు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలము పై కాలితో తంతాడు.. శ్రీ మహా విష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో పాద సంహానం చేస్తూ భృగు పాదంలో ఉన్న కంటిని వత్తుతాడు.. భృగు కు జ్ఞానోదయమవుతోంది.. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలుక వహించి భూలోకానికి వేళతుంది. శ్రీమహాలక్ష్మి ని వెతుకుతూ శ్రీమహవిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నవుతాడు శ్రీమహావిష్ణువు.. శ్రీ మహా విష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మఆవు దూడలు కాగా శ్రీమహాలక్ష్మి గోప కాంత యై ఆ ఆవుదూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుండి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న వల్మీకంపై పాలను వర్షిస్తుంది. ఆవ ు పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీమహావిష్ణువుకు తగులుతుంది. గోపాలుడు మరణిస్తాడు.. రాజును పిశాచిగా మారమని శపిస్తాడు..గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళ మాత ను చేరతాడు.. అతనిని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్ర వాత్సల్యం చూపుతుంది. వ్యాహళికి బయలుదేరిన శ్రీనివాసుడు, ఆకాశరాజు కుమార్తె పద్మావతి ని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు..వకుళ ఆకాశరాజను కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్ధిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది..ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది.. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు.. అతనితో సతులూ.. పిమ్మట బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుని మహిమలు చూపే ఇతర కథలు చిత్రంలో పొందు పరిచారు.
 
==నటవర్గం==