పట్రాయని నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''''పట్రాయని వెంకట నరసింహశాస్త్రి గారు'''''''' [[సాలూరు పెదగురువు]] గారిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు. వీరి కుమారుడు సాలూరు చినగురువుగా ప్రసిద్ధిచెందిన [[పట్రాయని సీతారామశాస్త్రి]].
 
పట్రాయని పాపయ్యశాస్త్రి గారి ఏకైక కుమారుడు - పట్రాయని నరసింహశాస్త్రిగారు.. 1872 [[భావ]] నామ సంవత్సరంలో జన్మించారు. పట్రాయని వంశం పూర్వీకులు సంపన్నులే అయినా తాతగారు పట్రాయని పెదనరనన్నగారి అమాయకత్వానికి, దుర్వ్యయానికి వారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. చామలాపల్లిలో[[చామలాపల్లి]]లో పట్రాయనివారికి సెంటు భూమి లేకపోయినా వారి పేరుతో పిలవబడుతున్న చెరువులు, తోటలు ఉన్నాయి. నరసింహ శాస్త్రి గారి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి. తండ్రి పాపయ్యశాస్త్రిగారు 35 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆయన మరణం తర్వాత తల్లితో పాటు ఆమె పుట్టిల్లు [[కారాడ]] కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారం లో మధురాపంతుల కూర్మన్నగారి కుమార్తె సూరమ్మగారితో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండేవారట. ఆథ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.
 
మధురా పంతులమధురాపంతుల పేరయ్యశాస్త్రిగారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరుపడ్డ సంగీత విద్వాంసుడు నరసింహ శాస్త్రిగారి మామగారు మధురాపంతుల కూర్మన్నగారికి పేరయ్యశాస్త్రిగారు సోదరుడు. ఆ విధంగా పినమామగారి వద్ద నరసింహశాస్త్రిగారికి కూడా శిష్యరికం లభించింది. పేరయ్యశాస్త్రిగారు తంజావూరులో సంగీత సాధన చేసినవారు. [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రిగారి శిష్యులు, ప్రముఖ ద్వివేదుల కన్నడు శాస్త్రి, ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి సోదరులు పేరయ్యశాస్త్రిగారి వద్ద కూడా శిష్యరికం చేసారు. మధురాపంతుల పేరయ్య శాస్త్రిగారు గొప్ప సంగీత విద్వాంసులు. ఆనంద గజపతి మహా రాజులతో ఘన సన్మానం పొందినవారు. పెద కాద అనే పల్లెలో నివాసం ఏర్పరచుకొని భూముల మీద వచ్చే ఆదాయంతో కాలక్షేపం చేసేవారు. సంగీత సాధనలో శిష్యులు ఏమాత్రం అశ్రద్ధ చూపినా భరించలేక పోయేవారుట. పేరయ్యశాస్త్రిగారు చాలా ఆత్మగౌరవం కలిగిన విద్వాంసులు. ఆయన సంగీత కచేరీ చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి పక్కవారితో బాతాఖానీ ప్రారంభించడం చూసి పాడడం ఆపేసారుట. ఆయన ఏదో చెప్పబోతే, నీ కచేరీలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే నీవేం చేస్తావు. ఇది నా కచేరీ అన్నారుట. నరసింహ శాస్త్రిగారికి గురువుగారంటే అమితమైన గౌరవం, భయభక్తులు ఉండేవిట. పేరయ్యశాస్త్రిగారి శిక్షణలో సంగీత రీతులను కంఠస్థం చేసుకొని రాగాలాపన, స్వరకల్పన ప్రావీణ్యం సంపాదించి వివిధ రీతులలో పల్లవి పాడడంలో నిష్ణాతులయేరు శిష్యులు.
 
అప్పుడప్పుడే కచేరీ పద్ధతి ఆంధ్ర దేశంలో ప్రారంభమవుతున్న రోజులు. దాక్షిణాత్య సంగీత ప్రభావంతో సంగీత త్రిమూర్తుల రచనలను కచేరీలలో పాడడం సంప్రదాయంగా ఉండేది. శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలు ప్రచారంలోకి వస్తున్న రోజులు. సంగీత శిక్షణను గురు ముఖతః పొందడం తప్ప వేరే దారి లేదు. నరసింహ శాస్త్రిగారు కీర్తన గ్రంథం నేర్చుకోవడానికి కొన్నాళ్ళు మద్రాసులో మకాం పెట్టారు. మద్రాసులో ఒక పెళ్ళి ఊరేగింపులో నంజుండయ్య అనే విద్వాంసుడు భైరవి రాగాలాపన చేసి ఒక విలంబ కాలం పల్లవి ఎత్తుకున్నారుట. నరసింహ శాస్త్రిగారికి పల్లవి ఆలాపన మీద ప్రత్యేకమైన అభిరుచి ఉండేదట. నంజుడయ గారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పల్లవి తనకు చెప్పమన్నారుట. ఆనాడు నరసింహశాస్త్రిగారు రాజుగారు గౌరవంగా కప్పిన శాలువా వేసుకొని ఉన్నారట. నంజుండయ్యరుగారు ఈ శాలువాను గురుకట్నం క్రింద స్వీకరించి నరసింహశాస్త్రిగారికి పల్లవి పాడడం నేర్పారుట.