వన పర్వము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
==కవిత్రయం రచనా విశేషాలు==
 
సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. [[పాటిబండ్ల మాధవశర్మ]] ఇలా వ్రాశాడు -
 
తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కనకవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు.
 
==ఆధ్యాత్మిక, తాత్విక విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వన_పర్వము" నుండి వెలికితీశారు