స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
=== కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట ===
గాంధారిని చూసిన [[కృపాచార్యుడు]] దుఃఖం ఆగక " అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా ! నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. [[భీముడు]] సుయోధనుడిని అధర్మంగా నాభి కింద భాగానకిందభాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగ లేదుఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజమును హయములను దారుణంగా చంపాము. కనుక పాండవుల విజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో పాండవులు [[శ్రీకృష్ణుడు]] [[సాత్యకి]] అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు. లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు శలవిప్పించండి వెళతాము " అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత దూరం పోయిన [[కృపాచార్యుడు]] వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. [[కృతవర్మ]] ద్వారకకు వెళ్ళాడు. [[అశ్వత్థామ]] గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయాజనమేజయ మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత [[ధృతరాష్ట్రుడు]] అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.
 
=== ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట ===