సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
=== నేపధ్యగాయకునిగా ===
నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. '[[పరమానందయ్య శిష్యులు]]' (1950), 'శ్రీలక్ష్మమ్మ[[శ్రీ లక్ష్మమ్మ కథ]]' (1950), '[[స్త్రీ సాహసం]]' (1951) మొదలైన చిత్రాలలో ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. '[[సర్వాధికారి]]' (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు.
 
=== సంగీత దర్శకునిగా ===
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన '[[సేతు బంధన్‌]]' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన 'భట్టి విక్రమార్క' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ''ప్రముఖ నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ''గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమె తో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పని చేశారు. '[[సంసారం]]' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', '[[సర్వాధికారి]]' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), '[[నర్తనశాల]]' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! 'సంతానం' (1955)తో లతా మంగేష్కర్‌నూ, 'ఇలవేలుపు' (1956)తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, 'వచ్చిన కోడలు నచ్చింది' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, 'నర్తనశాల' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!