సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
దక్షిణామూర్తి గారు తల్లిదండ్రులు తెనాలి లో ఉండగా కాంచనమాల ద్వారా దక్షిణా మూర్తి గారి ప్రతిభ విన్న [[భీమవరపు నరసింహారావు]] గారు తెనాలి వచ్చి వారి గానం విని మదరాసు కు ఆహ్వనించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేసారు.
 
== హెచ.ఎం.వి.లో ==
1938లో 'హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌' (హెచ్‌.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. ప్రఖ్యాత సంగీత దర్శకుల జంట ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ - రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి వారికి సహోద్యోగి. .
 
== ఆకాశవాణిలో ==
1939 ప్రాంతంలో '[[ఆకాశవాణి]]' (ఏ.ఐ.ఆర్‌) - ఢిల్లీలో ప్రవేశించారు. ఆకాశవాణిలో వారు 'ఏ' గ్రేడ్‌ ఆర్టిస్టు. మద్రాసు, కలకత్తా, బెల్గామ్‌, పూనా, బొంబాయి, కటక్‌ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో పనిచేశారు. మద్రాసులో దాదాపు ఓ ఏడాది పాటు పనిచేశారు. వారి పనితీరుకు మెచ్చి, ఢిల్లీకి వెళ్ళమని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే వారనిి ఢిల్లీకి పంపించారట. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించారు. జాతీయ వార్త సంస్థ 'సెంట్రల్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్‌'లో సంగీత నిర్దేశకుడిగా సేవలందించారు