సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
== సన్మానాలు, సత్కారాలు ==
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] చేతులమీదగా సన్మానం అందుకున్నారు. వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. 'స్వరశిల్పి', 'సంగీత కళాప్రపూర్ణ', 'సుస్వరాల సుసర్ల', 'స్వరబ్రహ్మ', 'సంగీత కళానిధి', 'సంగీత సమ్రాట్‌', ఎన్టీఆర్‌ పేర్కొన్న 'స్వర సుధానిధి' లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు.
 
== ప్రస్తుతం ==
[[మధుమేహం]] వ్యాధి వలన కంటి చూపు దెబ్బతింది. దాదాపుగా [[అంధత్వం]] ఆవరించింది. అయినా, ఆయన ఇప్పటికీ మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా, ఇవాళ్టికీ కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు. తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, ఇప్పటికీ సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. ఈ వయసులో ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. బహుశా ఆ సలలిత రాగ సుధారస సారమే అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో మధ్య కూడా ఈ వయస్సులోనూ ఆయనను ముందుకు నడిపిస్తోంది.