మాధవపెద్ది గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాధవపెద్ది గోఖలే''' [[తెలుగు సినిమా]] ప్రపంచంలో ఉన్నతమైన [[కళా దర్శకులు]]. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బ్రాహ్మణకోడూరు గ్రామములో 1917లో జన్మించాడు. కొడవటిగంటి కుటుంబరావుకి దగ్గర బంధువు. గోఖలే [[విజయా స్టుడియో]]లో శాశ్వత కళా దర్శకులుగా పనిచేసి, ఎన్నో విజయవంతమైన పౌరాణిక, చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందడానికి కీలకమైన కృషి చేశాడు. అంతే కాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహితీవేత్త, జర్నలిస్టు, మానవతావాది. 'యువ', 'ఆంధ్రజ్యోతి' పత్రికలలో ఎన్నో చిత్రాలు వేశాడు. రచనా రంగములో కూడ కృషి చేసి 'బల్లకట్టు పాపయ్య', 'మూగజీవాలు', 'గోఖలే కథలు' మున్నగు రచనలు చేశాడు.
 
[[పాతాళభైరవి]], [[మాయా బజార్]] తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవారు.
"https://te.wikipedia.org/wiki/మాధవపెద్ది_గోఖలే" నుండి వెలికితీశారు