హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==చెరువులో కాలుష్యం==
హుస్సేన్ సాగర్‌లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం నగరవాసులకు, పర్యావరణ పరిరక్షణా వాదులకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. ముక్కులు బద్దలయ్యే మురుగు వాసన, దారుణంగా విస్తరించిన [[తూటికాడ]], [[గుర్రపుడెక్క]] మొక్కలు, బాగా కలుషితమైన చెరువు వినాశనానికి దారి తీస్తున్నాయి. అదుపు లేకుండా నగరం మురుగు నీరు సరస్సులోకి చేరుతుండడంవల్ల ఈ సమస్య నానాటికి తీవ్రతరమౌతున్నది. పాలకుల నిర్లక్ష్యం వలన పరిస్థితి నానాటికి దిగజారుతున్నది.<ref>http://reportersurya.blogspot.com/2008/06/hussain-sagar-rotting.html</ref> ఏటా వినాయక చవితి తరువాత జరిగే వేలాది విగ్రహాల నిమజ్జనం వల్ల కూడా చెరువు పూడిపోతున్నదనీ, అంతే కాకుండా ఆ విగ్రహాలలో వాడిన ప్లాస్టర్, ఇతర రసాయనాలు నీటిని మరింత కలుషితం చేస్తున్నాయనీ పర్యావరణ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు