కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
 
===దక్షిణ దిశలో సాగిన అన్వేషణ===
[[File:Sampati's Find.jpg|thumb|సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి]]
దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైని వెదికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. దాహార్తులై ఋక్షబిలం అనే ఒక సొరంగంలో ప్రవేశించారు. అందులోంచి బయట పడే మార్గం కానరాలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకొంటూ మహా తేజస్వినియై వెలిగిపోతున్నది. వారి కధ విని ఆమె వారికి ఆతిధ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని, తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది.
 
 
అంతు లేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరు వేసుకొంటుండగా అక్కడికి [[సంపాతి]] అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన [[జటాయువు]] మరణించాడని తెలిసికొని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకొని పోయి సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు.
 
===హనుమంతుని సంకల్పం===
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు