బాల్యవివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాల్య వివాహాలు''' :ఈ అనాగరిక దురాచారానికి [[పుత్తడిబొమ్మ పూర్ణమ్మ]] వంటి ఎందరో ముక్కుపచ్చలారని బాలలు బలైపోయారు.దీనికి మతపరంగాను, కులాల కట్టుబాట్ల కారణంగా మద్దతు లభిస్తూ వస్తోంది. పది సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలకు పూర్వం [[పెళ్ళి]] ల్లు చేసేవారు. పది సంవత్సరాలు నిండని [[కన్య]]ను నీ చేతుల్లో పెడుతున్నాననే పెళ్ళి మంత్రంతో [[కన్యాదానం]] జరుగుతుంది.భారత దేశంలో ఇంకాబాల్య వివాహాల దురాచారం కొనసాగుతూనే ఉంది. భారతీయ మహిళల్లో ఒకటింట అయిదో వంతు ఆడపిల్లలు పదిహేను సంవత్సరాలు నిండే లోపునే వివాహితలై పోతున్నారు. చట్టపరంగా నిర్ధారించిన వయసులోపునే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య యాభయి శాతంగా ఉంది. అయిదోవంతు అమ్మాయిలకు పదిహేనేళ్ల వయసులోపు... యాభయి శాతంమందికి పద్ధెనిమిదేళ్ల లోపు.... మూడింట రెండువంతుల మందికి ఇరవై సంవత్సరాల లోపునే పెళ్లిళ్లయి పోతున్నాయి.(ఈనాడు 21.2.2010).ఈ ఏడాది ఉత్తమ మహిళగా గ్లామర్ మేగజైన్ పురస్కారాన్ని పొందిన యెమన్ దేశానికి చెందిన పదేళ్ళ బాల వధువు సుజూద్ అలీ. ఈ అమ్మాయి 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెళ్ళిచేశారు. కోర్టులో పోరాడి విడాకులు పొంది మళ్ళీ బడికి వెళుతోంది.
==విశేషాలు==
ఈ ఏడాది ఉత్తమ మహిళగా గ్లామర్ మేగజైన్ పురస్కారాన్ని పొందిన యెమన్ దేశానికి చెందిన పదేళ్ళ బాల వధువు సుజూద్ అలీ. ఈ అమ్మాయి 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెళ్ళిచేశారు. కోర్టులో పోరాడి విడాకులు పొంది మళ్ళీ బడికి వెళుతోంది.
*బ్రిటిష్ పాలకులు1929 లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంక్ట్ యాక్ట్ తెచ్చారు.
*ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 ప్రకారం 18 ఏళ్ల లోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలలకిందే వస్తారు.
*బాల్యవివాహంగురించి సమాచారం తెలిసిన ఎవ్వరైనా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు, జిల్లా కలెక్టర్ , ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇలా ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. నోటిమాటగా చెప్పవచ్చు. ఉత్తరం రాయవచ్చు ఈ మెయిల్ చేయవచ్చు.
*బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. తల్లిదండ్రులు, సంరక్షుకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బాల్య వివాహానికి అనుమతించిన కులపెద్దలు, వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరూ నేరస్థులే..పెళ్లికి హాజరైనవారుకూడా నేరస్థులవుతారు.
*నేరస్థులకు రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం బాల్యవివాహాలను నిలుపుదల చేస్తూ కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు.
 
==మూలాలు==
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=124449&categoryid=1&subcatid=31
 
 
"https://te.wikipedia.org/wiki/బాల్యవివాహాలు" నుండి వెలికితీశారు