మాండూక్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు. ఇది [[అథర్వవేదం | అథర్వ వేదానికి]] చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ [[ఉపనిషత్తు]]లో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. [[శంకరాచార్యుడు]] దీనికి విస్తృత భాష్యం రచించి, తన [[అద్వైతం | అద్వైత సిద్ధాంతానికి]] ఆధారంగా చేసుకున్నాడు. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "అయమాత్మా బ్రహ్మ" అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.
==శాంతి మంత్రం==
 
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
 
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః |
 
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి నః పూషా విశ్వావేదాః |
 
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు||
 
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
==పూర్తి మంత్రపాఠం==
 
1. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం
 
భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ |
 
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోకార ఏవ||
 
ఈ లోకం ఏవత్తూ ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనది ఏముందో అది కూడా ఓంకారమే.
 
2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా సో యమాత్మా చతుష్పాత్
 
ఇవన్నీ భగవంతుడే. ఆ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిమాణాలు గలది.
 
3. జాగరికస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
 
స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః||
 
ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉన్నది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.
 
4. స్వప్నః స్థానో న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
 
ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః||
 
ఆత్మయొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. 7 అవ్యవాలు, 19 నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు.
 
5. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం
 
పశ్యతి తత్ సుషుప్తమ్| సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన
 
ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః ||
 
కోర్కెలు, కలలు ఏదీలేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణమవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్ మరియు స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆంనందాన్ని అనుభవిస్తాడు.
 
6. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్||
 
ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే కారణం.
==సారాంశం==
 
ఈ సమస్త జగత్తు [[ఓం]]కారమే. భూత భవిష్యద్వర్తమానాలు కూడా [[ఓం]]కారమే. ఈ [[త్రికాలములు | త్రికాలాలకు]] అతీతమైనది ఏదైనా ఉంటే అది కూడా [[ఓం]]కారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, అన్నిటికి [[ఓం]]కారం శబ్ద రూపమైన ప్రతీక. ఈ [[ఓం]]కారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే బ్రహ్మం.
 
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/మాండూక్యోపనిషత్తు" నుండి వెలికితీశారు