"ఆరుద్ర నక్షత్రము" కూర్పుల మధ్య తేడాలు

* 4 వ పాదము - వృశ్చికరాశి.
 
=== ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము-,తీఱు-తెన్నులు ===
ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఈరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/665121" నుండి వెలికితీశారు