"త్రినాథ వ్రతకల్పము" కూర్పుల మధ్య తేడాలు

భక్తులారా ! మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె నుండును. శ్రీపురము అను గ్రామము నందు మధుసూదనుడను నొక బ్రాహ్మణుడుండెడివాడు. మిక్కిలి దరిద్రుదగుటచే బిక్ష మెత్తుకుని జీవించే వాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించు చున్నది . ఆ బాలుడు చిక్క పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. " అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి " అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పు చున్నాడంటే 'ఓసీ' నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో, వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది . అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు. అని బ్రాహ్మణుడు చెప్పెను. బార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు చుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి, తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి, ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, పెనిమిటిని చూచి అయ్యా ! ఈ సొమ్మును తీసుకు వెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకు రండని చెప్పినది.
 
అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను .ఇట్లు తిరుగుచూ ,పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను . ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండి యున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది . తన ఆవులలో 'భోదా ' అనే ఆవు ఉండెను .అది మిగుల దుష్ట బుడ్డి గలది . బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది . ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్ద వారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచండెను . అది చూచి షావుకారు అతి కోపంతో యేమను చున్నాడంటే "ఇక దీని ముఖము చూడకూడదు. .అవును ఇప్పుడే అమ్మివేస్తాను. .ఇది 50 రూ || లురూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను " అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. "షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను ఆవూ దూడా రెండిటిని నాకు ఇప్పించండి " అని అనగానే " ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా " అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు "మీరు షావుకార్లు అయి ఉన్నారు మీమాటమీ మీరుమాట నిలుపుమీరు కోండినిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్య వంతులవుతారుఅసత్యవంతులవుతారు " అని అన్నాడు . ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని , తన మదిలో విచారించి తెలియక అనివేసినాను . ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో , ఈ ఆవును అతనికివ్వక పోతేఅతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా ! అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోష పడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది . ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించ లేదు .ప్రొద్దు పోయెడి వేళయినది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదక బోయినాడు .వీధుల్లోనూ వీధుల్లోనూ, సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోను చూచెను . ఆవు కనిపించకనిపించలేదు. లేదు .తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు.
 
; మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట :
అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని వున్నారు .వారు వరుసగా బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని ,లేచి పోవుచుండగా ,త్రిమూర్తులు బ్రాహ్మణునితో ' ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు " మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి "అయ్యా !నేను కడు బీదవాడను బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది .అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది .ఆ సంతకు వెళ్లి వెతికెదను .ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను ."అని తన సంగతి చెప్పెను.
అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే " నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక ,మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు . అంత బ్రాహ్మణుడు " యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి .ఒక్క పైసా ఆకు చెక్క ,ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి .ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే " ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను "అని అనగా ,త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే "ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో ఆ గోరంట పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి " ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి .ఇంకా ఉండునేమో నని ఆ చెట్టు నింకను పైకి లాగు చుండెను అది చూచి త్రినాదులవారు " బ్రాహ్మణుడా !నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు ,ఎంత దొరికినదో అంతే యుండును " అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని ,అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి. "ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు " అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు .అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు ,నాతో కపటంగా చెబుతున్నారు అనగా "ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు .మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించి నాడు .వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు .త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట
ఆకులు వక్కలు ,గంజాయి తీసుకుని ,నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , " ఈ బ్రాహ్మణుడు పిచ్చి వాడు కాబోలని నూనేలేదు .అని చెప్పినాడు .అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు " దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు " ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను " అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు . విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను .
 
==ఫలశ్రుతి==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/666933" నుండి వెలికితీశారు