త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 210:
; త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట :
ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని, నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , "ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు. అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు "దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు "ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను" అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచమైననూ లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తు కొచ్చి ముసలివాని ముఖముపై నీళ్ళు చల్లి, సేదతీర్చి కూర్చుండ బెట్టినారు. ఏమి చెప్పుదను ? ఎక్కడ నుంచో ఒక భ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపొయినాడు. ఈ లాగున అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు. "విప్రుడా ! విను మీరు నూనె కొన్నారు కదా ! అది కొలతకు తక్కువగా యున్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి" అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి, ముందు తెచ్చిన దుత్త తోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీ అయిపోయినది . అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయినది. విప్రుని గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి శలవు అడిగినాడు .
; త్రినాధుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట :
శలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే "ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని "స్వామీ ! ఏయే వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . 'ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే త్రుప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి, అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును." అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంబించి, గంజాయి ముందు తయారు పరచినాడు. అప్పుడు త్రిమూర్తులు "నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను బిక్ష మెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను, దీపము ముట్టించుటకు అగ్గి లేదు నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్దితో పూజ చేస్తాను ? అని ఏవగించు కుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు "ఓ ద్విజుడా ! మదిలో చింత పడకు .నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము, సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి " స్వాములారా ! అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను.
==ఫలశ్రుతి==
|