త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 213:
; త్రినాధుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట :
శలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే "ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని "స్వామీ ! ఏయే వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . 'ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే త్రుప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి, అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును." అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంబించి, గంజాయి ముందు తయారు పరచినాడు. అప్పుడు త్రిమూర్తులు "నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను బిక్ష మెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను, దీపము ముట్టించుటకు అగ్గి లేదు నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్దితో పూజ చేస్తాను ? అని ఏవగించు కుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు "ఓ ద్విజుడా ! మదిలో చింత పడకు .నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము, సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి " స్వాములారా ! అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే ! నేను ఏమి చేయగలను ? అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు "ఓ బ్రాహ్మణుడా ! నీ రెండు నేత్రములు మూసుకో" వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి, సాష్టాంగ దండ మొనరించినాడు.
 
; త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట :
త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను" అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు . చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్దతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు .
 
==ఫలశ్రుతి==
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు