తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
తీగలు నాటిన మొదటి ముడు రోజుల వరకు రెండు పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజూ ఒక పూట (సాయంత్రం) మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజుల కొకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
 
చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన [[వెదురు]] గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి [[మొక్కజొన్న]]తో పంట మార్పిడి చేయాలి.
 
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో [[భాస్వరం]], 40 కిలోల [[పొటాష్]] వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి [[నత్రజని]]ని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి+యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున [[జిప్సం]] వేసుకోవాలి.
 
[[వర్గం:పైపరేసి]]
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు