తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==సాగుచేయు విధానం==
తమలపాకు సంవత్సర [[వర్షపాతం]] 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ [[ఉష్ణోగ్రత]] గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
 
మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల [[అవిశ]] విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.
పంక్తి 37:
చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన [[వెదురు]] గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి [[మొక్కజొన్న]]తో పంట మార్పిడి చేయాలి.
 
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో [[భాస్వరం]], 40 కిలోల [[పొటాష్]] వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి [[నత్రజని]]ని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి + యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున [[జిప్సం]] వేసుకోవాలి.
 
[[వర్గం:పైపరేసి]]
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు